ఎన్టీఆర్,పూరీ మూవీ క్లాప్ కొట్టారు(ఫొటో)
హైదరాబాద్ : ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న ఇంకా పేరు పెట్టని చిత్రం మొదలైంది. ముహార్త సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. కెమెరామెన్ శ్యామ్ కె.నాయుడు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి టెంపర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ...అవినీతితో నిండిపోయి ...ఎప్పుడూ లంచం...లంచం అంటూ తిరిగే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. పూర్తి మాస్ మసాలాతో సాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రం నిర్మించనున్నారు.

బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరబోతోంది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు. ' అన్నారు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











