‌అఫీషియల్ :ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం టైటిల్ ఖరారు

By Srikanya

హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ లండన్‌లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ని అఫీషియల్ గా చిత్ర నిర్మాణ సంస్ద తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ ద్వారా ఖరారు చేసింది. అదేమిటో ఇక్కడ చూడండి.

Happy to announce that the first look of our #NTR25 project shall be out on 17th. Co produced by Reliance Entertainments. #NannakuPrematho

Posted by Sri Venkateswara Cine Chitra on15 September 2015

పై మ్యాటర్ ప్రకారం ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో...' అనే టైటిల్ నే ఖరారు చేసారు. మొదటి నుంచీ ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నా టైటిల్ మారే అవకాసం ఉందని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ అఫీషియల్ ఎనౌన్సమెంట్ తో టైటిల్ విషయం తెలిసిపోయింది.

ntr-sukumar movie

చిత్రం విశేషాలకు వస్తే....

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే టైటిల్ లోగోను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు.

అలాగే ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X