ఇంకో యాక్షన్ కామెడీ ('రభస' ప్రివ్యూ)
ప్రస్తుతం పూర్తి స్ధాయి యాక్షన్ చిత్రాలకు ఆదరణ తక్కువగానే ఉంటోంది. అది గమనించిన పెద్ద హీరోలు తమ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కు తగిన స్ధానం ఉండేలా చూసుకుంటున్నారు.ఇంతకుముందు కామెడీ అనేది ఓ ట్రాక్ గా ఉండేది...కానీ ఇప్పుడు దాన్నే మెయిన్ ట్రాక్ గా చేసి కథ,కథనం పండించే ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమైనంత లైటర్ వీన్ లో కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ మరోసారి నవ్విస్తూ యాక్షన్ చేసిన కథతో ముందుకు వచ్చారు. అంతేకాకుండా సెంటిమెంట్, కుటుంబం వంటి వాటికి ప్రయారిటీ ఇచ్చి ఫ్యామిలీలను సైతం టార్గెట్ చేసారు.
కార్తీక్ (ఎన్టీఆర్) సరదా కుర్రాడు. ఎవ్వరిజోలికీ వెళ్లడు. కానీ తన జోలికి వస్తే వదలడు. కుటుంబం అంటే చాలా ఇష్టం. అలాంటి కార్తీక్... తన కుటుంబానికి ఆపద వస్తే ఎలా స్పందించాడు? ఎంతటి రభస చేశాడన్నదే కథ. ఇందు (సమంత), భాగ్యం (ప్రణీత)లతో కార్తీక్ నడిపించిన ప్రేమయాణం కూడా ఆసక్తిదాయకమే.

దర్శకుడు మాట్లాడుతూ.... ''నా రెండో చిత్రమే ఎన్టీఆర్‌తో చేస్తానని అస్సలు అనుకోలేదు. 'రభస' అంటే గొడవ అనుకొంటారు. కానీ.. వినోదంతో.. 'రభస' చేస్తాం. మానవీయ విలువలున్న కథ ఇది. ఓ కుటుంబం కోసం పరితపించిన యువకుడి కథ ఇది. ఎన్టీఆర్ స్టామినా ఏమిటో మరోసారి తెలుస్తుంది. సమంత పాత్ర చాలా కీలకం. బ్రహ్మానందం మరోసారి నవ్వులు పూయిస్తారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. ఆ సమయంలో ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్ ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోను'' అన్నారు.
చిత్రం: రభస
సంస్థ: శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
బ్యానర్ :సాయి గణేష్ ప్రొడక్షన్స్
నటీనటులు :ఎన్టీఆర్ ,సమంత , ప్రణీత, షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు
సంగీతం : తమన్ ,
ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు,
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్,
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు,
ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్,
సమర్పణ : బెల్లంకొండ సురేష్,
నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు,
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.
విడుదల తేదీ: 29,ఆగస్టు 2014


Click it and Unblock the Notifications











