For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారి యాక్షన్ ట్రైలర్ వదిలారు(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : రెండు రోజుల క్రితం బ్రహ్మానందం ను హైలెట్ చేస్తూ 'రభస' టీజర్ ని వదిలిన సంగతి తెలిసిందే. ఏమనుకున్నారో ఏమో కానీ ఎన్టీఆర్ ని హైలెట్ చేస్తూ యాక్షన్ ని మిక్స్ చేస్తూ... వెనువెంటనే ఇప్పుడు మరో ట్రైలర్ ని వదిలారు. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది. ఆ ట్రైలర్ ని మీరూ చూడండి...

    <center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/iYdnXAyWHeg?list=UUGpjgFN46Tfg_DQshUmltww" frameborder="0" allowfullscreen></iframe></center>

    ఎన్టీఆర్‌ హీరోగా 'కందిరీగ' ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలకీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'రభస'. ఈ చిత్రం ఆగస్ట్‌ 29న వరల్డ్‌వెడ్‌గా విడుదల కాబోదోంది.

    బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ "ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ఈచిత్రంలో ఎన్టీఆర్‌ పాడిన 'రాకాసి రాకాసి' ఈ ఆడియోకి హైలైట్‌ సాంగ్‌గా నిలిచింది. త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చేయబోతున్నాం. ఆదిలాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మా లకీనరసింహ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ చిత్రం అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆగస్ట్‌ 29న వరల్డ్‌వైడ్గగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో, మా బేనర్‌లో ఇది సెన్సేషనల్‌ హిట్‌ సినిమా అవుతుంది" అన్నారు.

    Ntr's Rabhasa new trailer

    సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ "యూత్‌ఫుల్‌, మాస్‌, ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రభస' ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఎన్టీఆర్‌ 'రభస' లో పక్కా మాస్‌ లుక్‌తో వుంటారు, యూత్‌ఫుల్‌ స్టైల్‌లో వుంటారు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టు కునేలా వుంటారు. ఎన్టీఆర్‌ ఈ మూడు జోన్స్‌ని టార్గెట్‌ చేసి తీస్తున్న సినిమా 'రభస' . రెండున్నర గంటలసేపు ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసి అందరూ అయిదార్లుసార్లు చూసేంత ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. బెల్లంకొండ సురేష్‌గారి రేంజ్‌ మేకింగ్‌లో ఈ సినిమాలో కనిపిస్తుంది" అన్నారు.

    ఎన్టీఆర్,సమంత తో పాటు ప్రణీత, బ్రహ్మానందం, అలీ, నాజర్, జయసుధ, బ్రహ్మాజీ, జె.పి, నాగినీడు, షాయాజీషిండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.

    English summary
    As the release date is nearing a new action trailer of "Rabhasa" has been released. The trailers hint that the film will be a complete commercial entertainer with the right doses of action, comedy, sentiment and romance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X