‘రభస’ యూఎస్ ప్రీమియర్ షో కలెక్షన్స్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. సినిమాపై ముందు నుండీ భారీ అంచనాలు ఉండటంతో రెండు మూడు రోజుల ముందే చాలా మంది టిక్కెట్క్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. దీంతో తొలిరోజు మంచి ఫలితాలు సాధించింది.
యూఎస్ఏలో రభస దాదాపు 100 థియేటర్లలో విడుదలైంది. ఇక ఇక్కడ ప్రీమియర్ షోలకు జరిగిన అడ్వాన్డ్స్ బుకింగ్ బట్టి దాదాపు $96,000 కలెక్ట్ చేసిట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోకే ఇంత భారీ మొత్తం వసూలు కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే సినిమా విడుదలైన తర్వాత యావరేజ్ టాక్ వచ్చింది. సినిమాలో అన్నీ హంగులు ఉన్నప్పటికీ కథ, కథనం రొటీన్‌గా ఉండటమే ఇందుకు కారణం.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‍గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత, బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవి ప్రకాష్, ప్రభాకర్, సురేఖా వాణి, ప్రగతి, సత్ కృష్ణ, మీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఫోటోగ్రఫీ: శ్యాకె నాయుడు, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ప్రేమ్ రక్షిత్, శేఖర్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ సురేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











