ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్య’ రిలీజ్ వాయిదా

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రాన్ని గతంలో ఆగస్టు 9న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ తాజాగా విడుదల తేదీన సెప్టెంబర్ 27కు మార్చారు. జూ ఎన్టీఆర్ తొలి సినిమా స్టూడెంట్ నెం.1 కొన్నేళ్ల క్రితం ఇదే తేదీన విడుదల కావడం విశేషం.

ఆ రోజున విడుదల చేస్తే సెంటిమెంట్ కలిసొచ్చి సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారట దర్శక నిర్మాతలు. అందుకే ముందుగా అనుకున్న సమయానికి కాకుండా విడుదల వాయిదా వేసినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. మరి ఈ సెంటిమెంటు ఏమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X