‘టెంపర్’ఆడియో విడుదల పోస్టర్
హైదరాబాద్: ఎన్టీఆర్, పూరిజగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుత్ను చిత్రం ‘టెంపర్'. ఈ చిత్రం ఆడియో ఈనెల 28న విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆడియో లాంచ్ పోస్టర్ విడుదల చేసారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. న్యూఇయర్ వేడుకగా ప్రేక్షకులకు టెంపర్ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ ఆడియోకి నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ సమాచారం. దీంతో నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది. అయితే బాబాయ్-అబ్బాయ్‌ని ఒకే వేదికపై చూడాలనేకునే అభిమానులు ఆరోజు కోసం వేచి చూస్తున్నారు. అదే నిజమైతే ఈనెల 26 న నందమూరి అభిమానులకు నిజమైన పండుగ అవుతుంది.

ఈ టీజర్‌కు యుట్యూబ్‌లో మంచి ఆదరణతో పాటు ఒక్కరోజులోనే రెండు లక్షలకుపైగా క్లిక్స్ వచ్చాయంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఈ సినిమాను ఆశిస్తున్నారో అర్ధమౌతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని కొన్ని లోకేషన్లలో ఎన్టీఆర్-కాజల్‌లపై దర్శకుడు పూరిజగన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా..ఫిబ్రవరి మొదటివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ‘టెంపర్ ' చిత్రం టీజర్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ మాస్‌లుక్‌తో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ఎన్టీఆర్ అభిమానులకు కనువిందు చేశాడు. ‘‘ ఇద్దరు కొట్టుకుంటే యుద్దం...అదే ఒకడు మీదడిపోతే అది దండ యాత్ర ఇది దయ గాడి దండ యాత్ర'' అనే పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి సూపర్ యాక్షన్ సీన్‌తో కనిపించి టీజర్‌లో అలరించాడు.
ఈ చిత్రంపై పూరిజగన్ మార్క్ కనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పూరి మార్క్‌కి ఎన్టీఆర్ డైలాగులు తోడయితే ఎలా ఉంటుందో చూపించేదే ఈచిత్రం. ఫుల్‌లెంగ్త్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ముద్దుగుమ్మ కాజల్ నటిస్తుంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరిజగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











