For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దయాగాడి దండయాత్ర ...(‘టెంపర్‌’ టీజర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : "ఇద్దరు కొట్టుకుంటే యుద్దం...అదే ఒకడే మీదడపోతే అది దండయాత్ర" అనే పవర్ ఫుల్ డైలాగుతో ఎన్టీఆర్ వచ్చేసాడు. న్యూ ఇయిర్ కానుకగా పూరి జగన్నాథ్ విడుదల చేసిన టెంపర్ చిత్రం టీజర్ ఇప్పుడు అభిమానులను ఓ రేంజిలో అలరిస్తోంది. ఈ టీజర్ తో ఒక్కసారిగా చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ టీజర్ పై మీరూ ఒక లుక్కేయండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్ ను నిన్న రాత్రి విడుదల చేశారు.

  Ntr's Temper movie Teaser out

  బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్‌'90 శాతం షూటింగ్‌ పూర్తయిం త్వరలో కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఆడియో వేడుకను నిర్వహించి, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.

  ఐటెం సాంగ్స్‌కి క్రేజీ తెచ్చిన డెర్టెక్లర్లలో ఒకరు పూరిజగన్‌. టెంపర్‌ సినిమాలోనూ మొరాకోకు చెందిన మోడల్‌ నోరా ఫతేహి తో ఐటెం సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ సాంగ్‌లో అమ్మడు దుమ్మురేపడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. టెంపర్‌ చిత్రానికి ఈ పాటే హైలెట్‌ అవుతుందని టాక్‌. సాంగ్‌కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్‌ కూడా వేసి రంగం సిద్ధం చేసి తీసారు. ఎంత తొందరగా షూటింగ్‌ ముగిస్తే అంత తొందరగా సినిమాను విడుదల చేయవచ్చని పూరి అనుకుంటున్నారు.

  ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇన్సపెక్టర్ దయ గా కనిపించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా రగ్గడ్ గా ఉండబోతోందని, చాలా సార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్ర ఇదని చెప్తున్నారు. సర్కిల్ ఇన్సపెక్టర్ గా ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడని వినికిడి. నాగార్జున శివ మణి లో చేసిన పాత్ర తరహాలో పూర్తి మాస్ టచ్ లో ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

  అలాగే ఈ చిత్రం ఆడియో జనవరి 10న విడుదల అయ్యే అవకాసం ఉంది. థియోటర్ ట్రైలర్ ఫిబ్రవరి 5 న విడుదల చేసి మార్చి చివరకు సినిమాని విడుదల చేస్తారు. ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్‌. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకుండూంటంతో మంచి క్రేజ్ వస్తోంది.

  కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు.

  ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  New Year's gift to all the Nandamuri fans. The most awaited, Temper teaser out!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X