టాప్‌ లేపుతున్న ’టెంపర్‌’ (కొత్త పోస్టర్)

By Srikanya

హైదరాబాద్: పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు 'టెంపర్‌‘. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరిగుతోంది.మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌ కొన్ని రోజులు ఆపేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఊపు అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కొత్త పోస్టర్ ఇలా బయిటకు వచ్చింది. ఈ పోస్టర్ టాప్ లేపుతోందనే చెప్పవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బ్రేక్...

Ntr's Temper New Poster

‘ టెంపర్‌ ' చిత్రానికి ఎన్టీఆర్‌ స్వల్ప విరామం ఇచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సోదరుడు జానకీరాం ఆకస్మిక మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల జానకీరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విధితమే. దీంతో ఎన్టీఆర్‌ బాగా కలత చెంది ఉన్నాడు. ఈ నేపధ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన టెంపర్‌ షూటింగ్‌ను పది రోజులపాటు వాయిదా వేశారు. అలాగే కొన్నాళ్లపాటు తండ్రి హరికృష్ణను చూసుకునే బాధ్యతను స్వీకరించాడు.

ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేయాలనే దృష్టిలో పూరిజగన్‌ షూటింగ్‌ను శరవేగంగా చిత్రీకరించారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. షూటింగ్‌ వాయిదా పడడంతో ఈ ఖాళీ సమయంలో సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ వర్క్స్‌ ప్రారంభించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గెటప్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన ముచ్చటగా మూడోసారి అందాల భామ కాజల్‌ నటిస్తుంది.

Ntr's Temper New Poster

ఐటం స్పెషల్..

ఇక... ఐటెం సాంగ్స్‌కి క్రేజీ తెచ్చిన డెర్టెక్లర్లలో ఒకరు పూరిజగన్‌. టెంపర్‌ సినిమాలోనూ మొరాకోకు చెందిన మోడల్‌ నోరా ఫతేహి తో ఐటెం సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ సాంగ్‌లో అమ్మడు దుమ్మురేపడం ఖాయమంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. టెంపర్‌ చిత్రానికి ఈ పాటే హైలెట్‌ అవుతుందని టాక్‌. సాంగ్‌కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్‌ కూడా వేసి రంగం సిద్ధం చేశారట.

ఎంత తొందరగా షూటింగ్‌ ముగిస్తే అంత తొందరగా సినిమాను విడుదల చేయవచ్చని పూరి అనుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు చిత్రం విడుదల చేసే ఆలోచనలో పూరిజగన్‌ ఉన్నారు. బండ్ల గణేష్‌ నిర్మాణ సారధ్యంలో సాగుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

ఫస్ట్ లుక్ ఎఫెక్ట్...

ఇప్పటికే...చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరయ్యాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది. ఈ సినిమాకి బండ్ల గణేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. పెద్ద స్టార్‌ కాస్టింగ్‌ అంతా నటించడం కూడా ఈ సినిమాకి మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.

ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X