భారీ కాయంతో జూ.ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ కోసం అంటూ వైరల్, అసలు గుట్టు వీడింది!
బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి తెలుగు సినిమా గర్వించేలా చేశాడు. మరోమారు అలాంటి ప్రయత్నమే మొదలు పెట్టాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రారంభించగానే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎన్టీఆర్, రాంచరణ్ తో కలసి రాజమౌళి ఎలాంటి అద్భుతం చేస్తాడో అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 11న పూజ కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.ఎన్టీఆర్ లుక్ గురించి వస్తున్న వార్తలపై ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ క్లారిటీ ఇచ్చాడు.

ఎన్టీఆర్, రాంచరణ్
రాజమౌళి చిత్రంలో హీరోల పాత్రలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. హీరోల లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో రాజమౌళి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ లో కూడా ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రల కోసం అలాంటి కసరత్తులే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో భారీ కాయంతో కనిపించబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ 100 కేజీల బరువు పెరుగుతున్నట్లు అటు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

భారీ కాయంతో
ఎన్టీఆర్ భారీ కాయంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఇదే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆ ఫోటోలని ట్రెండ్ చేశారు. నిజమనుకున్న కొందరు అభిమానులు ఎన్టీఆర్ ఇంత బరువయ్యాడా అంటూ ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆ ఫోటోలపై క్లారిటీ ఇచ్చాడు.
ఏడాది క్రితం ఫోటోలు
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు ఇప్పటివి కాదు. అవి ఏడాది క్రితం ఫొటోలు. ఎన్టీఆర్ ప్రస్తుత లుక్ ఇది కాదు అంటూ లాయిడ్ స్టీవెన్స్ తన ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు. స్టీవెన్స్ క్లారిటీతో.. రాజమౌళి అంత సులువుగా షూటింగ్ ఫోటోలు లీక్ కనివ్వడులే అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ బందిపోటు పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీసుగా నటిస్తున్నాడట.

కళ్ళు చెదిరే బడ్జెట్
డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. బాహుబలిలా ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కడం లేదు. అంటే ఒకే చిత్రానికి 300 కోట్లు. ఇక చిత్రం ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు రాజమౌళి ప్రకటించలేదు. డిసెంబర్ 12 ఆర్ఆర్ఆర్ కొత్త అప్డేట్ రాబోతునట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











