twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కిక్‌-2' గురించి ఎన్టీఆర్ ట్వీట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రవితేజ తాజా చిత్రం 'కిక్‌-2' ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ టీమ్ కు విషెష్ చెప్తూ జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. పటాస్ విజయం తర్వాత కళ్యాణ్ రామ్ అన్న చేస్తున్న ఈ చిత్రం తప్పక హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ సాగింది. ఆ ట్వీట్ మీరూ చూడండి.

    Ntr's tweet about Ravi teja's ‘Kick 2′

    ఇక ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో గతంలో ఊసరవెల్లి, అశోక్ చిత్రాలు వచ్చాయి. అయితే రెండూ అనుకున్న స్ధాయిలో విజయం సాధించలేదు. ఒక టైమ్ లో కిక్ 2 లో ఎన్టీఆర్ హీరోగా ఉండే అవకాసం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ అని రవితేజతో వెళ్తున్నామని అన్నారు. త్వరలో మళ్లీ ఎన్టీఆర్,సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో చిత్రం ఉండే అవకాసం ఉందని తెలుస్తోంది.

    'కిక్‌-2' విషయానికి వస్తే... ఈ సారి కంఫర్ట్ అనే కాన్సెప్టు తో వస్తున్న ఈ చిత్రం పూర్తి కంపర్ట్ ప్రాజెక్టు అంటున్నారు. దానికి తోడు ఈ సారి కేవలం కామెడీని మాత్రమే కాక యాక్షన్ ని కూడా జోడించి వదులుతున్నారు. ఓ రకంగా ఇది కంఫర్ట్ తో కూడిన డబుల్ డోస్ అని చెప్తున్నారు.

    ఇందులో రవితేజ రాబిన్ హుడ్ గా కనిపిస్తారు. కథలో ఎక్కువభాగం రాజస్ధాన్ లోని విలాస్ పూర్ అనే గ్రామంలో జరుగుతుంది. ఎన్నారై అయిన రాబిన్ హుడ్ తన ఆస్దులు అమ్మకం కోసం ఇండియా వస్తాడు. అక్కడ రకుల్ ప్రీతితో ప్రేమలో పడతాడు. ఆమెతో డ్యూయిట్స్ పాడుతూ, పండిట్ రవితేజ (బ్రహ్మానందం)ఇంట్లో గెస్ట్ గా ఉంటూ వచ్చిన అతనికి రకుల్ విషయంలో ఓ ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ...విలీస్ పూర్ గ్రామానికి దారి తీస్తుంది. అది సోలామన్ సింగ్ ఠాకూర్ (రవికిషన్) రాజ్యం. అక్కడ అతను ఎంత చెప్తే అంత. అక్కడ జనం చాలా ఇబ్బందులు పడుతూంటారు. అవన్నీ చూసినా కంఫర్ట్ అనే రాబిన్ హుడ్ యాక్షన్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి ఇష్టపడడు. అయితే కొన్ని పరిస్దితులు అతన్ని రవికిషన్ పైకి దండెత్తేలా చేస్తాయి. ఆ పరిస్ధితులు ఏంటి...రాబిన్ హుడ్ ఎలా ఆ విలన్ ని ఎదిరించాడు. రకుల్ ప్రీతి సింగ్ లక్ష్యం ఏమిటి అనేది మిగతా కథ.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ కిక్ సిరీస్ లో.... ఫస్ట్ పార్ట్ మొత్తం కామెడీ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఈ రోజున వస్తున్న కిక్ 2... కామెడీ తో పాటు కంఫర్ట్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని అలరించబోతోంది.

    'కిక్‌ 2' గురించి రవితేజ మాట్లాడుతూ...ఇది 'కిక్‌'కు సీక్వెల్‌ కాదు. రెండూ వేర్వేరు కథలు. 'కిక్‌' శుభం కార్డులో 'కిక్‌ 2' రాబోతోందని హింట్‌ ఇచ్చాం. అయితే అప్పటికి 'కిక్‌ 2' ఆలోచనే లేదు. మూడేళ్ల క్రితం వక్కంతం వంశీ ఓ లైన్‌ చెప్పాడు. దాన్ని రాసుకొంటూ వెళ్తే ఈ సినిమాకి 'కిక్‌ 2' అనే పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. 'కిక్‌'లో హీరో పేరు కల్యాణ్‌. 'కిక్‌' అంతా వాడి గోలే. ఇది వాళ్ల అబ్బాయి రాబిన్‌ హుడ్‌ కథ. వీడిదంతా 'కంఫర్ట్‌' గోల.. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు.

    ఈ చిత్రం తో తప్పకుండా డబుల్‌ కిక్‌ ఇస్తాం . 'కిక్‌' కంటే ఎక్కువ వినోదం ఉంటుంది. పాటలూ బాగున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా యాక్షన్‌ పార్ట్‌ బాగా వచ్చింది. 'కిక్‌'లో యాక్షన్‌కు అంత చోటు దక్కలేదు. ఈ సినిమాలో మాత్రం పోరాట దృశ్యాలు బాగుంటాయి. ఓ కమర్షియల్‌ సినిమాలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉండడం చాలా అరుదుగా జరిగే విషయం. 'కిక్‌ 2'లో అది సాధ్యమైంది అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. సినిమాలో హైలెట్ అవుతుంది '' అని తెలిపారు.

    నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.... ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిచాం. భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

    English summary
    Ntr tweeted: Wishing the whole team of kick 2 all the best.am sure Kalyan Anna will continue his win streak at the box office post patas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X