'నాన్నకు ప్రేమతో' ఆడియో పంక్షన్ హైలెట్స్...(ఫొటోలతో)
హైదరాబాద్ : సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రంలోని పాటలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
హరికృష్ణ మాట్లాడుతూ ‘‘ తారక్‌కి మాత్రం నేనే తారకరామ్ అని పెట్టా. ఒకసారి నాన్నగారు మీ మూడోవాడు ఏం చేస్తున్నాడు? ఒకసారి తీసుకురా'అన్నారు. పై నుంచి కిందకి చూసి నీ పేరేంటి?' అని అడిగారు. తారకరామ్ అని చెప్పాడు. నీది నా అంశ నా
పేరు నీకుండాలని నందమూరి తారక రామారావు అని పెట్టారు. అలా ఆయన పేరును ఆయనే దానం చేశారు. '' అన్నారు.
''సుకుమార్ కథ రాయడు. జీవితాన్ని రాస్తాడు. సుక్కు నాన్నగారి కొన ఊపిరి నుంచి పుట్టిన కథ ఇది'' అని ఎన్టీఆర్ అన్నారు. ‘‘నేను నటించిన 25వ చిత్రమిది. ఇన్ని చిత్రాలు కాదు కదా అసలు నేను నటుడిని అవుతానని కూడా అనుకోలేదు. నీ వెన్నంటి
నేనున్నానని నాకు ధైర్యం చెప్పి పరిశ్రమకి పంపించింది మా నాన్నగారే. ఈ సినిమా తల్లిదండ్రులకి నీరాజనం'' అన్నారు ఎన్టీఆర్.
ఆడియో పంక్షన్ ఫొటోలు స్లైడ్ షోలో ...

విడుదల చేసారు..
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విడుదల చేసి తండ్రి హరికృష్ణకి అందజేశారు.

ట్రైలర్ ని..
సినిమా ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ...
''సత్యమూర్తిగారు చనిపోయిన రెండో రోజు దేవీకి మెసేజ్ చే శాను. అతను నాకు పంపించిన రిప్లైలో తన బాధతో పాటు పాటల రికార్డింగ్ స్టేటస్‌ని కూడా మెసేజ్ చేశాడు. మన వల్ల పని డిస్ట్రబ్ కాకూడదని సత్యమూర్తిగారు చెప్పిన మాటను దేవి పాటిస్తుంటాడు.

ఏడ్చేసాడు
'నాన్నకు ప్రేమతో' ప్రపంచంలోని తండ్రులందరికీ ఇచ్చే నీరాజనం. కెమెరామ్యాన్ విజయ్‌గారైతే నేనో ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు ఏడ్చేశాడు. మా టీమ్ అంతా నాన్న పిచ్చోళ్లమే'' అని ఎన్టీఆర్ అన్నారు.

నేర్పించారు..
సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పుడు మా నాన్నగారు 'కింద పడండి.. చావు దాకా వెళ్లండి.. మీరు మీరుగా బతకండి' అని నేర్పించారు అని చెప్పుకొచ్చారు.

పిరికిపందల్లా బతకటం...
ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తూ.. ఏ రోజూ పిరికిపందల్లా బతకడం నేర్పించలేదు. ఈ జీవితాన్నిచ్చిన నాన్నగారికి కృతజ్ఞతలు అన్నారు.

ఎన్టీఆర్ ని చూడరు
ఇక సినిమా విషయానికొస్తే ఇందులో ఎన్టీఆర్‌ని చూడరు. సుకుమార్‌ని చూస్తారు. రాజేంద్రప్రసాద్‌లో సుకుమార్ తండ్రిగారిని చూస్తారు అని ఎన్టీఆర్ చెప్పారు

చాలా త్యాగం చేసాడు
దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకోసం చాలా త్యాగం చేశాడు. దేవి, సుకుమార్, నేను, విజయ్ కె.చక్రవర్తి... ఇలా ఈ సినిమా కోసం పనిచేసినవాళ్లల్లో చాలామంది నాన్న పిచ్చోళ్లు ఉన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ మంచి నటి. జగపతిబాబుగారు నా హృదయానికి దగ్గరగా ఉండే వ్యక్తి. ఆయన నటించకపోతే ఇది గొప్ప సినిమా అయ్యుండేది కాదు'' అన్నారు ఎన్టీఆర్.

సుకుమార్ మాట్లాడుతూ....
''నాకు పిల్లలు పుట్టాక మా అమ్మానాన్నలను ఇంకా ప్రేమించడం మొదలుపెట్టాను. నిస్వార్థంగా మనల్ని ప్రేమించేవాళ్లు అమ్మానాన్నలు మాత్రమే. ఎందుకంటే వాళ్ల సామ్రాజ్యంలో మనమే రారాజులం. '' అన్నారు.

సుకుమార్ కంటిన్యూ చేస్తూ...
నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత ఎమోషనల్‌గా ఉన్నానో అదే సినిమాలో చూపించడానికి ట్రై చేశాను. రాజేంద్రప్రసాద్‌గారి 'లేడీస్ టైలర్' షూటింగ్ చూసేటప్పుడే నాకు సినిమాల మీద ఆసక్తి కలిగింది

హరికృష్ణ మాట్లాడుతూ...
''జానకీరామ్, కల్యాణ్‌రామ్ పేర్లు మా నాన్నగారే పెట్టారు. జూనియర్‌కు తారక రామ్ అని నేను పెట్టా. నాన్నగారు 'విశ్వామిత్ర' షూటింగ్ అప్పుడు తారక రామ్‌ని తీసుకు రమన్నారు. 'నీ పేరేంటి' అని మనవణ్ణి ఆయన అడిగితే, 'నాన్నగారు తారక రామ్ అని పెట్టారు'
అన్నాడు.
'నా పేరు నీకుండాలి' అని నందమూరి తారకరామారావు అని మా నాన్నగారు పెట్టారు'' అని చెప్పారు.

జగపతిబాబు మాట్లాడుతూ..
''నాన్నగారు స్థాపించిన జగపతి బ్యానర్‌పై మళ్లీ సినిమాలు తీయాలనుకుంటున్నాను'' అని జగపతిబాబు పేర్కొన్నారు.

నటించే అవసరం వచ్చింది
జగపతిబాబు కంటిన్యూ చేస్తూ... ...చాలా కాలం తర్వాత నాకు నటించే అవసరం వచ్చింది. ఇందులో నా పాత్ర అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఏమొచ్చింది ఇతనికి డబ్బు తక్కువైతే మేం ఇస్తాం కదా? ఇలాంటి పాత్ర చేశాడేంటి అంటారు. తారక్ వ్యక్తిత్వం, తన స్నేహమే వేరు. సెట్‌కి అందరికంటే ముందొచ్చిన సందర్భాలున్నాయి'' అన్నారు.

ఎక్కడా పుట్టడు
''మా నాన్నగారు లక్ష కిలోమీటర్లు మా తాతగారి కోసం చైతన్య రథం నడిపారు. మా నాన్నగారిలాంటి గొప్ప కొడుకు ఎక్కడా పుట్టడు'' అని కల్యాణ్‌రామ్ అన్నారు.

కొత్త తారక్ ని చూస్తారు
కల్యాణ్‌రామ్ కంటిన్యూ చేస్తూ.. ‘‘నాన్నకు ప్రేమతో అంటే... ఒక కొడుకు వాళ్ల నాన్న మీద ఎంత ప్రేమతో ఏం చేశాడనేదే. ఈ సినిమాలో నాన్న నేపథ్యంలో ఓ అద్భుతమైన సన్నివేశం ఉంది. అందులో తారక్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతో కొత్త తారక్‌ని చూస్తారు'' అన్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మట్లాడుతూ....
''30 ఇయర్స్ నుంచి మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. మా అమ్మ ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. 'నాన్నకు ప్రేమ'తో పాటలను మా నాన్నగారికి అంకితం చేయడం సంతోషంగా ఉంది'' అన్నారు.

తలైవా అంటా...
దేవిశ్రీప్రసాద్ కంటిన్యూ చేస్తూ... ‘‘ఎన్టీఆర్‌ని తలైవా అని పిలుస్తుంటా. ఎన్టీఆర్, సుక్కులతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు మా నాన్నగారికి కృతజ్ఞతలు చెబుతున్నా. సినిమానే లోకంగా బతికారాయన.ఈ పాటల వేడుకని మా నాన్నగారికి ప్రేమతో అంకితం చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

వివి వినాయిక్ మాట్లాడుతూ..
ఎన్టీఆర్‌తో సినిమా గురించి అభిమానులు అడగడంతో ‘‘అదుర్స్ 2 చేస్తానా, ‘ఆది 2' చేస్తానో తెలియదు కానీ త్వరలోనే చేస్తా'' అన్నారు వినాయక్.

భావోద్వేగం
తండ్రుల గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ తదితరులు భావోద్వేగానికి లోనయ్యారు.

రకుల్ ప్రీతి సింగ్ మాట్లాడుతూ...
సినిమా బాగ వచ్చిందని, విజయవంతం కావాలని కోరుకున్నారు. నటిగా తనను ఈ సినిమా నిలబెడుతుందని, హీరోయిన్ కి, ఓ నటికి ఉన్న తేడా సుకుమార్ నేర్పించారని అన్నారామె.

కొరటాల శివ మాట్లాడుతూ...
ఎన్టీఆర్ తో సినిమా అంటే ఏం రాయలనేది భయం అని, అందుకే తన తదుపరి చిత్రం కోసం రాత్రింబవళ్లు రాస్తున్నానని అంటున్నారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ...
మా వాడు ఎన్టీఆర్ గురించి ఏం చెప్పను..అందరూ చూడాల్సిందే అన్నారు. ఈ చిత్రంలో తాను అవసరాల, ఎన్టీఆర్ కి బ్రదర్ గా చేస్తున్నారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ...
నేను నాలుగు సంవత్సరాలు తిరిగాను..ఆయనతో పని చేయాలని అయితే టెంపర్ తో కుదిరింది. ఫీవర్ తో కూడా ఆయన ఇరగదీసారు. అందులో సాంగ్స్ కన్నా అదిరిపోయేలా ఈ సినిమాలో చేసానని అన్నారు.

చంద్రబోస్ మాట్లాడుతూ...
ఎన్టీఆర్ గారికి మొదటి సినిమానుంచి రాస్తున్నా..ఈ సినిమాలో మూడు పాటలు రాసా..ఇందులో నాకు బాగా నచ్చిన పాట..డోంట్ స్టాప్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ... వాళ్లు నిన్ను విసిరేసామని అనుకోని..వాళ్ళకు తెలియదు...నువ్వు ఒక బంతివని ...అంటూ చెప్పారు.

నిర్మాత కెఎస్ రామారావు మాట్లాడుతూ...
అదృష్టవశాత్తు ఈ పంక్షన్ కు వచ్చాను. నా మిత్రుడు సత్యమూర్తి గారి ఆటోబయోగ్రఫీ చూస్తే అప్పటిసంగతులన్నీ గుర్తుకు వచ్చాయి. నాకే ఆయన ఎక్కువ సినిమాలు రాసారు. మా బ్యానర్ లో ..చంటి,పెదరాయుడు చిత్రాలు సత్యమూర్తిగారు రాసారు.

భాస్కరభట్ల మాట్లాడుతూ...
మామూలుగా యంగ్ టైగర్ గారికి పాట రాయటం అంటే అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సుకుమార్ గారికి ఇదే తొలిసారి రాసాను..

దిల్ రాజు మాట్లాడుతూ..
టెంపర్ తో హీట్ గా ఉన్న తారక్..సంక్రాంతికి వచ్చి ఇరగతీస్తున్నాడు. టోటల్ న్యూ లుక్ తో సుకుమార్ ఈ సినిమా చేసాడు. పెద్ద సక్సెస్ రాబోతోంది ఈ సంక్రాంతికి అన్నారు.

వక్కంతం వంశీ మాట్లాడుతూ...
2016లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని అన్నారు.

ఎవరెవరు..
ఈ కార్యక్రమంలో కొరటాల శివ, రకుల్ ప్రీత్ సింగ్, చంద్రబోస్, భాస్కరభట్ల, వక్కంతం వంశీ, యర్నేని నవీన్, కె.ఎస్.రామారావు, దిల్ రాజు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, విజయ్ కె.చక్రవర్తి, రవీందర్, రాజీవ్ కనకాల, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











