ఎన్టీఆర్ కాబోయే భార్య 'బృందావనం' హిట్టవ్వాలని...
జూ.ఎన్టీఆర్ కాబోయే భార్య లక్ష్మి ప్రణతి..ఈ రోజు రిలీజవుతున్న "బృందావనం" చిత్రం పెద్ద హిట్టు కావాలని దేముళ్ళకు మ్రెక్కుకుంటున్నట్లు చెప్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించబోయే తాను.. సెంటిమెంట్ గా ఈ చిత్రం బాగా ఆడితే ..తను అడుగు పెట్టిన వేళా విషేషం బావుంటుందని కోరుకుంటోందని ఆమె స్నేహితురాళ్ళుతో చెప్పినట్లు సమాచారం.అందులోనూ ఎన్టీఆర్ గత చిత్రం అదుర్స్ ఊహించిన విజయం సాధించలేదు. కాబట్టి ఈ "బృందావనం" చిత్రం ఎన్టీఆర్ కు కీలకం. ఇక ఆమె ప్రార్ధనలు మరికొద్ది గంటల్లోనే ఫలించే అవకాశం ఉంది. ఇక కాజల్,సమంత హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. పూర్తి స్ధాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్..తమ వివాహం గురించి రీసెంట్ గా క్లారిఫై చేసారు. పెళ్లి వచ్చే ఏడాది నా పెళ్లి నవంబర్‌లో అనే ప్రచారం జరుగుతోంది. కానీ నవంబర్‌లో నా పెళ్లి లేదు. వచ్చే ఏడాది ఉంటుంది. ఎప్పుడనేది నేనే చెబుతా అంటూ తేల్చి చెప్పారు జూ.ఎన్టీఆర్.


Click it and Unblock the Notifications











