40 ఏళ్ల ‘ఎన్టీఆర్’ యుగపురుషుడు.. అప్పట్లో సంచలనానికి కేరాఫ్ అడ్రస్!
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన యుగపురుషుడు చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. శతదినోత్సవంతో సెన్సేషనల్ హిట్‌గా సంచలనం రేపిన యుగపురుషుడు జూలై 14, 1978లో విడుదలైంది. వైజయంతి ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ రూపొందించారు. కే బాలయ్య దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌తో అశ్వినీదత్ సినిమా రూపొందించడం రెండోది.

అంతకు ముందు ఎన్టీఆర్‌తో అశ్వినీదత్ ఎదురులేని మనిషి చిత్రాన్ని 1975లో రూపొందించారు. నిర్మాతగా అశ్వినీదత్ రెండో చిత్రంగా యుగపురుషుడు నిర్మించారు. ఏ ముహుర్తాన ఈ చిత్రానికి ఆ పేరు పెట్టారో అప్పటి నుంచి ఎన్టీఆర్‌ను యుగపురుషుడిగా అభిమానులు కీర్తించడం మొదలుపెట్టారు.

yugapurushudu ntr nandamuri taraka rama rao c ashwini dutt k bapaiah యుగపురుషుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు సీ అశ్వినీదత్ కే బాపయ్య


Click it and Unblock the Notifications