భారీ వ్యయంతో జూ ఎన్టీఆర్ 'శక్తి' షూటింగ్ లడక్ లో
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీమూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి' షూటింగ్ ఆదివారం నుంచి లడక్‌లో జరుగుతోంది. ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి అశ్వనీదత్ వివరిస్తూ'సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, జమ్ము, కాశ్మీర్, రుషికేష్, హరిద్వార్‌లో చిత్రీకరిస్తామన్నారు. అంతకుముందు ఈజిప్ట్‌లో జరిగిన షెడ్యూల్‌లో విలన్ గ్రూప్‌కి సంబంధించిన సన్నివేశాల్ని జాకీ ష్రాఫ్, పూజాబేడి, సోనూ సూద్‌లతో పాటు 25 మంది విదేశీ నటులు పాల్గొనగా చిత్రీకరించాం. తాజా షెడ్యూల్ లడక్‌లో 350 మంది యూనిట్ సభ్యులతో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాం.
తెలుగు చలనచిత్ర చరిత్రలో హయ్యస్ట్ నెంబరాఫ్ లొకేషన్స్‌లో, హయ్యస్ట్ బడ్జెట్‌తో , హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ లాండ్ మార్క్ ఫిలిం అవుతుంది' అన్నారు. ఎన్టీఆర్ సరసన ఇలియానా నటిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, పూజా బేడి, సోనూ సూద్, నాజర్, ఆలీ, కృష్ణభగవాన్ తదితరులు ఇతర ముఖ్య తారాగణం.
ఈ చిత్రానికి మాటలు:సత్యానంద్, రచనాసహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సమర్పణ: సి.ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్‌రమేష్.


Click it and Unblock the Notifications











