ఎన్టీఆర్ కొత్త చిత్రం రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్
హైదరాబాద్ : ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో ఇంకా పేరు పెట్టని చిత్రం రేపటి నుంచి అంటే జనవరి 4 నుంచి షూటింగ్ మొదలు అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రంలో సమంత స్నేహితురాలిగా చేసిన బొద్దుగా ఉన్న అమ్మాయి విద్యురామన్ ఈ చిత్రంలో కీ రోల్ చేస్తోంది. ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందే బాద్షా చిత్రం దాదాపు అరవై శాతం షూటింగ్ పూర్తైంది.
గతంలో ఎన్‌టిఆర్, దిల్‌రాజుల కాంబినేషన్‌లో వచ్చిన 'బృందావనం' ఎలా కలెక్షన్లు తిరగరాసిందో అందరికీ తెలుసు. ఈ చిత్రంలో సమంతతోపాటు మరో ప్రముఖ హీరోయిన్ కూడా నటించనుంది. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- . జనవరి 4 నుండి 14 వరకు రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో
ఉంటుందన్నారు. 'బృందావనం' తరువాత ఎన్టీఆర్, సమంతల కాంబినేషన్‌లోమా బ్యానర్‌లో సినిమా అనగానే హై ఎక్సపెక్టేషన్స్ వుంటాన్నాయన్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూలై 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో బృందావనం వంటి హిట్ చిత్రం తీసిన దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి,స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











