13న ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభం
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా నటించబోయే కొత్త చిత్రం ఈ నెల 13న హైదరాబాద్‌లో మొదలవుతుంది. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. ఈయన గతంలో 'కందిరీగ' చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుంది. ఈ చిత్రం కథ వినగానే ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు.
ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ..."ఎన్టీఆర్ కి ఫరఫెక్ట్ గా సూట్ అయ్యే అధ్బుతమైన సబ్జెక్టు సంతోష్ శ్రీనివాస్ రెడీ చేసారు. కథ వినగానే ఎన్టీఆర్ ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించే ఈ చిత్రంకు సంభందించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియచేస్తాము" అన్నారు.
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కందిరీగ-2' చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు కూడా. అయితే 'కందిరీగ-2'కి ఆదిలోనే హంసపాదులా.. మొదట్లోనే రకరకాల సమస్యలు వచ్చాయి. దర్శకుడు, నిర్మాతల విభేధాలతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతోంది.
ఎన్టీఆర్ సరసన సమంత చేసే ఈ చిత్రానికి సమర్పణ బెల్లంకొండ సురేష్, నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు, కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం సంతోష్ శ్రీనివాస్... శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తారు.


Click it and Unblock the Notifications











