For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్-హరీష్ శంకర్ చిత్రం ఓ లవ్ స్టోరీ

    By Srikanya
    |

    హైదరాబాద్: జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

    ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో వచ్చిన బృందావనం హిట్ కావటంతో ఈ కాంబినేషన్ పై మరింత అంచనాలు పెరుగుతాయి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. గబ్బర్ సింగ్ తో తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్న హరీష్ ఈ చిత్రంతో తెలుగులో తిరుగులేని దర్శకుడుగా ఎదుగుతాడంటున్నారు.

    మరో ప్రక్క గతంలో ఎన్టీఆర్ తో బృందావనం వంటి హిట్ చిత్రం తీసిన దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    English summary
    N Samantha will be seen opposite NTR once again in director Harish Shankar’s next.
 The buzz in film circles is that the movie will be a warm love story which will also have the trademark action and entertainment elements that NTR is famous for. Harish Shankar is raring to score a big hit with this project to cement his place in the industry as a successful director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X