జూ ఎన్టీఆర్ రెండో కొడుకు ఫోటో ఇదేనా? సోషల్ మీడియాలో వైరల్...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులు జూన్ 14న రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే కొడుకు ఫోటో మాత్రం ఆయన షేర్ చేయలేదు. తాజాగా ఎన్టీఆర్ కొడుకు ఫోటో ఇదే అంటే సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. చూస్తుంటే ఇది రియల్ ఫోటో మాదిరిగానే ఉంది. ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ బాబు అచ్చం లక్ష్మిప్రణతి పోలికలతో ఉన్నాడని అంటున్నారు.

ఎన్టీఆర్ కొడుకు ఫోటో ఇదేనా..
ఎన్టీఆర్ దంపతులకు ఇప్పటికే అభయ్ రామ్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. 2014లో అభయ్ రామ్ జన్మించగా మూడేళ్ల గ్యాప్ తర్వాత రెండో బిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టిన వెంటనే ఎన్టీఆర్ ‘మా ఫ్యామిలీ మరింత పెద్దది అయింది. బాబు పుట్టాడు' అంటూ ట్వీట్ చేశాడు.

గతంలో కూతురు పుట్టినట్లు రూమర్స్
కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్-ప్రణతి దంపతులకు కూతురు జన్మించిందంటూ వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ వెబ్ సైట్ ఈ వార్తను ప్రచురించడంతో అంతా నిజమే అని నమ్మారు. అయితే వెంటనే ఎన్టీఆర్ ప్రతినిధి మహేష్ కోనేరు ఈ పుకార్లను ఖండించారు.

త్రివిక్రమ్ మూవీలో బిజీ బిజీ
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీరరాఘవ' అనే సినిమా చేస్తున్నారు. పూజా హెడ్గే హీరోయిన్. ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో పాత్ర కోసం ఎన్టీఆర్ భారీగా బురువు తగ్గి స్లిమ్ లుక్‌లోకి మారిపోయాడు.

నెక్ట్స్ రాజమౌళి దర్శకత్వంలో
త్రివిక్రమ్ మూవీ పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు యంగ్ టైగర్. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











