ఎన్టీఆర్ 'శక్తి' విడుదల తేదీ మళ్ళీ మారింది...అదెప్పుడంటే
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'శక్తి" చిత్రం విడుదల వాయిదా పడింది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేద్దామనుకున్నారు. ఆ తర్వాత కాదు..సంక్రాంతికి రేస్ లో ఉంటుందన్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ని మార్చి 28కి మార్చారు. వేసవికి విడుదల చేస్తే శెలవులు కలిసొస్తాయని భావించి మార్చారని తెలుస్తోంది. అలాగే అప్పటికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో, అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది..అదే "శక్తి" స్పెషాలిటీ అని నిర్మాత ఆశ్వనీదత్ చెప్తున్నారు.
ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు అందుస్తున్నారు. ఆయన సమకూర్చిన ఆరు పాటల్లో ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. జాకీష్రాప్, పూజాబేడి, సోనూ సూద్ వంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్ సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే..దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











