కుంభమేళాలో శక్తి చూపనున్న జూ ఎన్టీఆర్
ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్లో రెడీ అవుతున్న శక్తి చిత్రం షూటింగ్ ప్రస్తుతం హరిద్వార్ లో జరుగుతోంది. అక్కడ జరుగుతున్న కుంభమేళాలో ఎన్టీఆర్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ ప్లాన్ చేసి షూట్ చేస్తున్నారు. చిత్రంలో వచ్చే ఓ కీలకమైన సన్నివేసం మరియు ఓ ఫైట్ సీక్వెన్స్ కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో చూపనున్నారని తెలుస్తోంది. అలాగే ఈజిప్టు, లండన్, జయపూర్, మైసూర్ వీటితో పాటు నార్త్ ఇండియాలోని కొన్ని ప్రసిద్ద ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని ప్రెస్టేజియస్ గా భావించి భారీ ఖర్చుతో రూపొందిస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కంత్రి చిత్రం ఇదే బ్యానర్ లో ఇదే కాంబినేషన్లో గతంలో వచ్చింది. అలాగే ఇలియానా, ఎన్టీఆర్ కాంబినేషన్ రాఖీ చిత్రం వచ్చింది.
జూ ఎన్టీఆర్ ఇలియానా మెహర్ రమేష్ కంత్రి మైసూర్ jr ntr brindavanam shakti ileana rakhi krishna vamsi ashwini dutt


Click it and Unblock the Notifications