బొమ్మ అదిరింది: ఇద్దరు కొడుకులతో జూ ఎన్టీఆర్

By Bojja Kumar

Recommended Video

Ntr Shared His Second Child Pic

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులు జూన్ 14న రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటో కొన్ని నిమిషాల్లోనే నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు ఈ ఫోటో చూసి తెగ మురిసిపోతున్నారు.

బొమ్మ అదిరింది

ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటోలో తమ్ముడిని అభయ్ రామ్ ఎత్తుకుని ఉండగా..... ఎన్టీఆర్ ఆ ఇద్దరి ఫోటోను తన సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. ఈ ఫోటో ఎంతో చూడముచ్చటగా ఉందని అభిమానులు అంటున్నారు.

ఇది నిజమైన ఫోటోయేనా?

ఇది నిజమైన ఫోటోయేనా?

రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ కొడుకు ఇతడే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయంది. అయితే ఈ ఫోటో నిజమైందా? కాదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఆ ఫోటో తన కుమారుడిది కాదని ఎన్టీఆర్ నుండి ఎలాంటి ఖండన రాలేదు కాబట్టి అంతా నిజమే అని అనుకుంటున్నారు.

గతంలో కూతురు పుట్టినట్లు రూమర్స్

గతంలో కూతురు పుట్టినట్లు రూమర్స్

కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్-ప్రణతి దంపతులకు కూతురు జన్మించిందంటూ వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ వెబ్ సైట్ ఈ వార్తను ప్రచురించడంతో అంతా నిజమే అని నమ్మారు. అయితే వెంటనే ఎన్టీఆర్ ప్రతినిధి మహేష్ కోనేరు ఈ పుకార్లను ఖండించారు.

త్రివిక్రమ్ మూవీలో బిజీ బిజీ

త్రివిక్రమ్ మూవీలో బిజీ బిజీ

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీరరాఘవ' అనే సినిమా చేస్తున్నారు. పూజా హెడ్గే హీరోయిన్. ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో పాత్ర కోసం ఎన్టీఆర్ భారీగా బురువు తగ్గి స్లిమ్‌ లుక్‌లోకి మారిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X