twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రోజు ఫోన్ రాగానే వణికిపోయా: టెర్రిఫిక్ సంఘటన గురించి చెప్పిన ఎన్టీఆర్

    By Bojja Kumar
    |

    సెలక్ట్ మొబైల్ స్టోర్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫోన్‌ వల్ల మరిచిపోలేని సంఘటనలు జీవితంలో ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఓసారి మా అమ్మ నుండి ఫోన్ రాగానే వణికి పోయాను, అది నా జీవితంలో మరిచిపోలేని టెర్రిఫిక్ సంఘటన అంటూ దాని గురించి వివరించారు.

    స్విట్జర్లాండులో ఉన్నపుడు కంగారు మొదలైంది

    స్విట్జర్లాండులో ఉన్నపుడు కంగారు మొదలైంది

    మా ఆవిడ ప్రెగ్నెంటుగా ఉన్నపుడు రభస షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాను. ఫలానా తేదీ అని డెలివరీ డేట్ ఇచ్చారు. అయినప్పటికీ ఈ టైమ్ నుండి ఈ టైమ్ వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమైనా సమస్య అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చేయండి అన్నారు. స్విట్జర్లాండ్‌లో షూటింగ్ గ్యాపులో మా ఆవిడతో మాట్లాడుతుంటే ఏదో తేడాగా అనిపించింది, నేను లేకుండా డెలివరీ అవుతుందేమో అని కంగారు మొదలైందని ఎన్టీఆర్ తెలిపారు.

    నా గుండె ఆగినంత పనైంది

    నా గుండె ఆగినంత పనైంది

    నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, అప్పుడే కనేయకు, నేను వచ్చే వరకు ఆగు లేకుంటే చంపేస్తాను అన్నాను. అదేం లేదు బానే ఉంటుందని తను చెప్పింది. నేను హైదరాబాద్‌లో ల్యాండైన తర్వాత ఫోన్ చేసి ఎక్కడున్నావంటే ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పడంతో నా గుండె ఆగినంత పనైంది. ఊరికే చెకప్ కోసమే అని చెప్పడంతో అంతా బానే ఉంటుంది కదా అని నేను ఇంటికి వెళ్లాను... అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు.

    ఆ సమయంలో వణుకు పుట్టింది

    ఆ సమయంలో వణుకు పుట్టింది

    ఆ సమయంలో ఆసుపత్రిలో ప్రణతితో మా అమ్మగారు ఉన్నారు. ఇంటికి వెళ్లి కాఫీ తాగుతుంటే మళ్లీ ఫోన్ వచ్చింది. మా అమ్మ ఫోన్ చేసి డాక్టర్ గారు మాట్లాడతారట అనగానే ఒక్కసారిగా వణుకు మొదలైంది. శరీరమంతా చల్లబడిపోయింది. మీరు ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత బావుంటుంది అని డాక్టర్ చెప్పారు. వెంటనే బయల్దేరి వెళ్లాను... నేను ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లిన వెంటనే మా పెద్దబ్బాయి పుట్టడం జరిగింది. ఒకవేళ నేను దుబాయ్‌లో స్టక్ అయిపోయి రావడం ఏ కొంచెం లేటయినా నేను సమయానికి అక్కడ ఉండేవాన్ని కాదు. ఫోన్‌లో అది నా టెర్రిఫిక్ ఇన్సిడెంట్... అని ఎన్టీఆర్ తెలిపారు.

    అందుకే ‘సెలక్ట్' చేసుకున్నా

    అందుకే ‘సెలక్ట్' చేసుకున్నా

    చిన్నతనంలో మొబైల్స్ ఫోన్స్ కొత్తగా వచ్చిన సమయంలో జగదీష్ మార్కెట్లో మొబైల్ కొనడానికి వెళ్లేవాళ్లం. అక్కడ కొన్నిసార్లు వారు చెప్పే మాటల ప్రభావానికి గురయ్యేవారం. అయితే సెలక్ట్ మొబైల్స్ లాంటి సంస్థలు మనం కోరుకున్న ఫీచర్లు ఉన్న ఉత్తమ ఫోన్లను అందిస్తారనే నమ్మకంతో దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పుకున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.

    English summary
    NTR Shares Scary Incident With His Wife Pranathi at celekt Mobile Launch. Tollywood Young Tiger Jr NTR has turned a brand ambassador for CELEKT Mobiles. While gracing the official announcement press meet this evening at ITC Kohenur in HiTech City. Hyderabad, the actor has interacted with media questions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X