కౌబాయ్ లొకేషన్స్ లో ఎన్టీఆర్ డాన్స్
హైదరాబాద్ : ది గుడ్ ది బ్యాడ్ అండ్ అగ్లీ, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్, ఫర్ ఎ ఫ్యూ మోర్ డాలర్స్ మోర్ వంటి కౌబాయ్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఆ సినిమాలతో పాటు ఆ సినిమాలు షూట్ చేసిన స్పెయిన్ లొకేషన్స్ సైతం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, శృతి హాసన్ ఆ లొకేషన్ లోనే ఉన్నారు. ఆ లొకేషన్ బ్యాక్ డ్రాప్ లో 'రామయ్యా వస్తావయ్యా' కోసం ఓ పాటను షూట్ చేస్తున్నారు. సినిమాలో ఈ పాట హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ...చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'.
ఈ విషయమై శృతి హాసన్ ట్వీట్ చేస్తూ... " స్పెయిన్ లోని...క్లింట్ ఈస్ట్ వుడ్, సేర్జి లియోని స్టే చేసిన హోటల్ లోనే ఉంటున్నాను... వావ్..వావ్..వావ్...!." అంది. ఇక 'రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం హంసా నందిని పై ఓ స్పెషల్ సాంగ్ ని త్వరలోనే షూట్ చేయనున్నారు. ప్రభాస్ 'మిర్చి' ఐటం సాంగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 'రామయ్యా వస్తావయ్యా' సినిమా కోసం ఎన్.టి.ఆర్ తో స్టెప్పు లేయడానికి సిద్దమవటంతో ఫ్యాన్స్ లో ఆనందం కలుగుతోంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నా ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 8 న శిల్పకళా వేదికలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం స్పెయిన్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ రెండు పాటలు తీస్తారు. ఒకటి సమంత పైనా, మరొకటి శృతి హాసన్ పైనా సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్ ఈ చిత్రం యూనిట్ వస్తుంది. వచ్చిన మరుసటి రోజే ఆడియో విడుదల అవుతుంది.
ఇక సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27 విడుదల చేస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. "ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లను దృష్టిలో పెట్టుకుని గందరగోళాన్ని నివారించడానికి ఈ వివరణ ఇస్తున్నాను. సినిమాను ఇంతకు ముందు చెప్పినట్టు సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తాం. ఇందులో ఏ మార్పూ లేదు. ఏది ఏమైనా ఇది జరిగితీరుతుంది" అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.
దిల్ రాజు మాట్లాడుతూ- ''ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే మైసూర్‌లో ఎన్టీఆర్, సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాం. నేటి నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలైంది. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. అలాగే... ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.


Click it and Unblock the Notifications












