మీతో మాట్లాడను-ఎన్టీఆర్
ఎక్కడైనా, ఎప్పుడైనా ఎన్టీఆర్ అక్కడ వున్నాడంటే చాలు మొత్తం సందడి సందడిగా వుంటుంది అనేది సినీవర్గాల అభిప్రాయం. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ కూడా ఎక్కడున్నా అందరితో కలివిడిగా వుంటూ సందడి చేసేవాడు. అలాంటి ఎన్టీఆర్ ఈ మధ్య ఏ ఫంక్షన్ లోనూ కనిపించుట లేదు. వచ్చినా ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. మీడియాతో మాట్లాడినా ఏదో ముక్తసరిగా సమాధానం చెప్తున్నాడే కానీ తన సినిమాల గురించి అస్సలు మాట్లాడుటలేదు.
ఎన్నికల్లో టిడిపి పరాజయం, ఇటీవల తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న క్లిప్పింగ్స్ వివిద ఛానెళ్లలో ప్రసారం అవడం ఎన్టీఆర్ ను అమితంగా బాధించాయట. అందుకే ఓ పెద్ద హిట్ ఇచ్చిన తర్వాతే పబ్లిక్ తో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మీదే దృష్టంతా పెట్టి హిట్ కొట్టాలనే పట్టుదతో వున్నాడట. స్వతహాగా మొండి వాడైన ఎన్టీఆర్ తను అనుకున్నది సాధించుకోవడానికి ఎంత సాహసానికైనా వెనుకాడడు అన్న అభిప్రాయం వుంది. ఎన్టీఆర్ ఓ బ్లాక్ బస్టర్ మూవీతో మన ముందుకు రావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











