హాట్ టాపిక్: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్(ఫోటో)
హైదరాబాద్: ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కూడిన ఫోటోనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఈ ఫోటోను బాగా షేర్ చేస్తున్నారు. సన్నబడ్డ శరీరంతో ఎన్టీఆర్ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. అయితే ఈ ఫోటో ఎంతవరకూ నిజమనేది తెలియటం లేదు. బాద్షా రచయిత కోన వెంకట్ ఈ ఫోటో విషయమై తన ట్విట్టర్ లో స్పందిస్తూ... ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో... పర్శనల్ అని... అది లీక్ అయిందని అన్నారు. ఎన్టీఆర్ ని ఈ రూపంలో చూడాలనుకున్న అభిమానులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం బాద్షా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై దర్శక,నిర్మాతలు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ 3 సినిమాల్లో 'బాద్‌షా' ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. మార్చి మొదటి వారంలో ఆడియో విడుదల చేస్తామని, అదే నెల చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని వెల్లడించారు.
ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేశ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ "కోన వెంకట్, గోపీమోహన్ అందించిన స్క్రిప్టును శ్రీను వైట్ల అద్భుతంగా తెరకెక్కిస్తుంటే, హీరోగా ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తున్నారు'' అని చెప్పారు.
చిత్ర రచయితల్లో ఒకరైన గోపీమోహన్ "చివరి పాట ముందుగా వచ్చే సన్నివేశాలు ఎన్టీఆర్ అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ ఉర్రూతలూగిస్తాయి. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, బ్రహ్మానందం ఎపిసోద్, శ్రీను వైట్ల మార్కు కామెడీ హైలైట్‌గా ఉంటాయి. ఎన్టీఆర్ డాన్సులు ప్రత్యేకంగా ఉండాలని వైట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. నాలుగు పాటలు ఇంకా తియ్యాలి. తీసినవి హైలైట్ అవుతాయి'' అని ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కూర్పు: ఎం.ఆర్. వర్మ, కళ: ఎ.ఎస్. ప్రకాశ్.


Click it and Unblock the Notifications











