»   » డబ్బు రిలేషన్ కాదు, బ్లడ్ రిలేషన్: ఎన్టీఆర్ నిర్ణయం సూపర్ !

డబ్బు రిలేషన్ కాదు, బ్లడ్ రిలేషన్: ఎన్టీఆర్ నిర్ణయం సూపర్ !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు టాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఫాంలో ఉన్న టాలీవుడ్ మోస్ట్ టాలెంట్ యాక్టర్ల టాప్ లిస్టులో ఎన్టీఆర్ ఒకరు. పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా, యాక్షన్ పరంగా, డైలాగ్స్ డెలివరీ పరంగా పర్‌ఫెక్ట్. యాక్టింగులో కొన్ని రకాల వేరియేషన్స్, డైలాగులు ప్రస్తుతం ఉన్న స్టార్లలో ఒక్క ఎన్టీఆర్ తప్ప మరో హీరో పర్‌ ఫెర్‌‌ఫెక్టుగా చెప్పలేరంటే అతిశయోక్తి కాదేమో.

Also Read: జల్సా జీవితం: నేరస్తులతో హీరోయిన్ల సంబంధాలు, ఎవరెవరు?

మరో వైపు ఎన్టీఆర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు...ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ కూడా ఎక్కువే. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద దర్శకులు పోటీ పడుతుంటారు. టాలీవుడ్లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. తన టాలెంటుతో పాటు సినిమాకు కమిట్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రెమ్యూనరేషన్, ఇతర మనీ మ్యాటర్లలో ఎన్టీఆర్ నిక్కచ్చిగా ఉంటాడు, ఏ మాత్రం తగ్గడు పేరుంది.

Also Read: మహేష్ బాబు ట్వీట్ చేసిన ఆరేళ్ల తర్వాత... త్రిష స్పందన!

అయితే ఇవన్నీ బయటి వారి దగ్గరే. అవన్నీ కేవలం డబ్బు రిలేషన్ షిప్పులు మాత్రమే కాబట్టి ఎన్టీఆర్ అలా ఉండటంతో ఆశ్చర్యం ఏమీలేదు. అయితే బ్లడ్ రిలేషన్ షిప్ విషయంలో మాత్రం తారక్ తీరు మరోలా ఉంది. త్వరలో ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ సొంత బేనర్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్'లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తయిన వెంటనే కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా చేయబోతున్నాడు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

బర్త్ డే పార్టీలోనే ప్రకటన

బర్త్ డే పార్టీలోనే ప్రకటన

జులై 5న అన్నయ్య కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసి ఎన్టీఆర్.. తన తర్వాతి సినిమా నీతోనే చేస్తానని అన్నయ్యాకు మాట ఇచ్చాడట.

డబ్బు కోసం కాదు... రిలేషన్ కోసం

డబ్బు కోసం కాదు... రిలేషన్ కోసం

తాను ఈ సినిమా డబ్బు కోసం చేయడం లేదని, అన్నయ్య కోసమే చేస్తున్నానని తారక్ స్పష్టం చేసాడట.

లాభాలు వస్తేనే..

లాభాలు వస్తేనే..

సినిమా రిలీజైన తర్వాతే రెమ్యూనరేషన్ తీసుకుంటానని, అది కూడా సినిమాకు లాభాలు వస్తేనే అని తేల్చి చెప్పాడట ఎన్టీఆర్.

డైరెక్టర్ ఎవరో?

డైరెక్టర్ ఎవరో?

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ మూవీకి డైరెక్టర్ ఇంకా ఖరారు కాలేదు.

 బిజీ బిజీ

బిజీ బిజీ

ప్రస్తుతం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ తమ సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. పూరితో కళ్యాణ్ రామ్ ‘ఇజం' చేస్తుండగా, ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో జనతాగ్యారేజ్ మూవీ తెరకెక్కుతోంది.

English summary
NTR, who is usually very stern about his remuneration and other money dealings, is said to have cut his pay by half for a special producer and it is none other than his brother Kalyan Ram. If the sources are to be believed, NTR is contemplating to do a film under his brother Kalyan Ram's banner, since a long time. Apparently, this time the actor has decided to put his thought into process and will be doing his next project under NTR Arts, without any further delay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu