తిన్నామా..పడుకున్నామా అన్నట్టుండేది:జూ.ఎన్టీఆర్
ఆలీ హీరోగా రూపొందుతున్న తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమా ఆడియోను ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రామానాయుడు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. రామానాయుడు ఆల్బమ్ ను విడుదల చేసి జూనియర్ ఎన్టీఆర్ కు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ మార్కెట్ చేస్తోంది.
ఈ సందర్భంగా యాంకర్ శిల్పా చక్రవర్తి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా జూనియర్ ఎన్టీఆర్ మట్లాడారు. ఆయన మాటల్లోనే...నేను స్లిమ్ కాక ముందు ఈ సినిమా టైటిల్ లాగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుండేది...ఎక్సర్ సైజ్ లేదు పాడులేదు..బాగా తినడం అలానే పడుకోవడం నుంచి బయటపడ్డాను...అందుకే ఇలా స్లిమ్ అయ్యాను..అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎస్ఎస్ రెడ్డి, బైరెడ్డి రామిరెడ్డి, దర్శకుడు రామ్ కుమార్, హీరో అలీ, హీరోయిన్ జ్యోతిక కృష్ణ, సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్ శ్రీలేఖ, ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శాసనసభ్యులు నోముల నర్సింహ్మయ్య, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. హీరో అలీ మాట్లాడుతూ...ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా కెరీర్ రైల్వే ట్రాక్ లా ఉండేది..దానికి అంతే లేకుండా ఉండేది...ఇపుడు కూడా అలానే ఉంది...నాకెరీర్ అంతం లేదని చాలా సంతోషిస్తున్నాను... కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా అలా సాగుతోంది...ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికి ధన్యవాదాలు..అన్నాడు.


Click it and Unblock the Notifications











