విదేశాల్లో ఫిట్‌నెస్‌పై జూ ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో కొత్తలుక్‌తో కనిపించనున్నాడు. సినిమా పూర్తయ్యే వరుకు ఒకే ఫిజిక్ మెయింటెన్ చెయ్యాలి కాబట్టి విదేశాల్లో షూటింగ్ జరుగుతున్నా సరే...అక్కడ ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయడం లేదు.
తన పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్‌ను తనతో పాటు అక్కడికి తీసుకెళ్లి హోటల్‌లో ప్రత్యేకంగా అకామిడేషన్ ఇప్పించాడు. అంతే కాదు తాను ఏ ప్రాంతానికి కెళ్లినా అక్కడి హోటల్‌లో అన్ని సౌకర్యాలతో కూడిన జిమ్ ఉందా? లేదా? అనే విషయాలు ముందుగా ఆరా తీస్తున్నాడట.
ప్రస్తుతం బాద్ షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. నిర్మాత గణేష్ భారీగా ఈ చిత్రం కోసం ఖర్చు పెడుతూ దర్శకుడు ఎలా చెబితే అలా సై అంటున్నాడు. ఇప్పటివరకూ ఏ చిత్రం షూటింగ్ జరగని ప్రదేశాలను ఎంచుకుని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెరపై ఆ దృశ్యాలు చాలా అద్బుతంగా కనిపిస్తాయని అంటున్నారు.
ఈ చిత్ంరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి గోపీమోహన్, కోన వెంకట్ అద్భుతమైన స్క్రిప్టు అందించారు. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 11, 2013న సంక్రాంతి కానుకగా చాలా గ్రాండ్ లెవల్లో 'బాద్ షా' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











