twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహానటి ఆడియో లాంచ్: తాతగారి పాత్ర పోషించమని అడిగారు.. ఈ జన్మకు జరగని పని.. ఎన్టీఆర్

    |

    Recommended Video

    Mahanati Audio Launch:savitri Family Emotional speech

    భారతీయ చలన చిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబందించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక నేడు జరగబోతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవర కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆడియో వేడుక ప్రారంభమైంది.

    ఆ అర్హత నాకు లేదేమో

    ఆ అర్హత నాకు లేదేమో

    మహానటి ఆడియో లాంచ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఎన్టీఆర్ ప్రసంగం అభిమానులని ఆకట్టుకుంది. మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఎన్ని జన్మలెత్తినా రాదేమో అని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తన ప్రసంగం చివరి వరకు ఆచి తూచి మాట్లాడడం విశేషం.

    నిజమైన సూపర్ స్టార్

    నిజమైన సూపర్ స్టార్

    మహానటి సావిత్రి నిజమైన సూపర్ స్టార్ అని ఎన్టీఆర్ అన్నాడు. సావిత్రిగారు ఎలా మరణించారొ ముఖ్యం కాదని, ఆమె ఎలా బ్రతికారనేదే ఈ చిత్రం అని ఎన్టీఆర్ తెలిపాడు. నాగ అశ్విన్ సావిత్రి గారికి ఓ అభిమానిగా ఈ చిత్రాన్ని తీసాడని ఎన్టీఆర్ తెలిపాడు.

    ప్రకృతే ఇలా చేసింది

    ప్రకృతే ఇలా చేసింది

    ఓ గొప్పపని చేసే సమయంలో వెతుక్కోవలసిన అవసరం ఉండదు. కావలసినవన్నీ అలా సమకూరుతాయి. కొంతమంది దానిని దేవుడి మహత్యం అని అంటారు. నేను మాత్రం ప్రకృతి వలన అని తనని ఎన్టీఆర్ అన్నారు. ఆ ప్రకృతి వలనే ఈ చిత్రానికి కావాల్సిన నటీ నటులంతా సమకూరారని ఎన్టీఆర్ తెలిపాడు. సావిత్రి గారి ఆత్మ పట్టు బట్టి మరీ తన బయోపిక్ లో నటించమని ఈ నటుల్ని పంపారని కీర్తి సురేష్, సమంత, దుల్కర్, విజయ్ దేవర కొండని ఉద్దేశించే ఎన్టీఆర్ అన్నాడు.

    ఈ జన్మకు జరగదు

    ఈ జన్మకు జరగదు

    ఈ చిత్ర నిర్మాత స్వప్న ఓ సారి తన వద్దకు వచ్చి చిరునవ్వు నవ్వుతూ ఓ కోరిక కోరారని ఎన్టీఆర్ అన్నారు. ఈ చిత్రంలో కామియోగా తాతగారి వేషం వేయమని అడిగారని ఎన్టీఆర్ తెలిపాడు. కానీ తాతగారి పాత్రలో నటించే అర్హత తనకు లేదని ఎన్టీఆర్ అన్నాడు. తాతగారి పాత్ర పోషించడం ఈ జన్మలో జరగని పని అని ఎన్టీఆర్ తెలిపాడు. తాతగారి పాత్రలో నటించాలంటే తన దమ్ము సరిపోదని ఎన్టీఆర్ తెలిపాడు.

    ఆడవారిమీద అకృత్యాలు

    ఆడవారిమీద అకృత్యాలు

    ఇటీవల తాను కొన్ని సంఘటనలని గమనిస్తున్నాని ఎన్టీఆర్ తెలిపారు. ఆడవారి మీద అకృత్యాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ అన్నాడు. ఈ చిత్రం చూసాక ఎందుకు మగవాళ్ళగా పుట్టామని అంతా భావిస్తారని అన్నారు. ఈ చిత్రం చూసాక అయినా ఆడవారిని గౌరవించాలని ఎన్టీఆర్ కోరాడు.

    English summary
    MahaNati Audio launch live updates. NTR is chief guest to the event. NTR Speech at MahaNati Audio launch event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X