twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను పడ్డ టెన్షన్ ఇపుడు అన్నయ్యలో కనిపిస్తోంది: జూ ఎన్టీఆర్

    By Bojja Kumar
    |

    నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీ 'నా నువ్వే'. జయేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఒకప్పుడు నేను పడ్డ టెన్షనే ఇపుడు అన్నయ్య పడుతున్నారని వ్యాఖ్యానించారు.

    యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే సందేహం ఉండేది

    యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే సందేహం ఉండేది

    ఎన్టీఆర్ మాట్లాడుతూ.... ‘నాకు మా అన్నను చూస్తుంటే మూడు సంవత్సరాల క్రితం నేను పడిన టెన్షన్ ఆయనలో కనిపిస్తోంది. *నాన్నకు ప్రేమతో' చిత్రం చేసినపుడు, ఒక డిఫరెంట్ గెటప్ లోకి మారినపుడు... అప్పటి వరకు నేను చేసిన సినిమాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రాన్ని యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే సందేహం ఉండేది.' అన్నారు.

    అలా చేస్తే సంతృప్తి ఉండదు

    అలా చేస్తే సంతృప్తి ఉండదు

    ప్రతి నటుడికి ఒక స్టీరియో టైప్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే ఆ నటుడికి సంతృప్తి ఉండదు, ఆ నటుడి సినిమాలు చూసే అభిమానులకు, ప్రేక్షకులకు సంతృప్తి ఉండదు. చిత్రం హిట్టయిందా? అనే దానికంటే ఆ నటుడు అద్భుతంగా నటించాడురా అనే కరతాళ ధ్వనులే ఒక నటుడికి ఎంతో ముఖ్యం.... అని ఎన్టీఆర్ అన్నారు.

    ఇవన్నీ నటుడికి సర్వసాధారణం

    ఇవన్నీ నటుడికి సర్వసాధారణం

    ఆ రోజు ‘నాన్నకు ప్రేమతో' సినిమా చేసినపుడు ఎంత టెన్షన్ కు గురయ్యానో ఈ రోజు కళ్యాణ్ అన్న మొహం చూస్తుంటే అదే టెన్షన్ కనిపిస్తోంది. కానీ తప్పదు. ఇవన్నీ నటుడికి సర్వసాధారణం. అన్నయ్య టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అభిమానులది, ప్రేక్షకులది చాలా పెద్ద హృదయం. జున్యూన్ గా కష్టపడితే వారికి పెద్దపీట వేయడం వారికి కొత్తమీకాదు. అలాంటి కోవకు చెందిన చిత్రాల్లో ‘నా నువ్వే' కూడా తప్పకుడా నిలుస్తుంది అనేది నా ప్రగాఢ నమ్మకం.... అని ఎన్టీఆర్ అన్నారు.

    అన్నయ్యలో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది

    అన్నయ్యలో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది

    నా నువ్వే టీం పడిన కష్టం వృధా పోదు, మీరు పడుతున్న టెన్షన్ వృధా పోదు. అన్నయ్య టెన్షన్ పడుతూనే ఓ అద్భుతమైన మాట చెప్పారు. ఈ చిత్రం రిలీజైన తర్వాత మీ అందరితో గంట సేపు మాట్లాడతానన్నారు. సినిమాపై ఆయనకు ఉన్న కాన్ఫిడెన్సుకు ఇది నిదర్శనం. ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది, మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను...అని ఎన్టీఆర్ అన్నారు.

    ప్రీ రిలీజ్ ట్రైలర్

    కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేశారు. లవ్ స్టోరీ మెయిన్ ట్రాక్‌గా రొమాంటిక్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ట్రైలర్ చూస్తుంటే కళ్యాణ్ రామ్, తమన్నా మధ్య జరిగే లవ్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ ,సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ , ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర.

    English summary
    NTR speech at Naa Nuvve Pre Release Event. Naa Nuvve - Pre Release Trailer Released by NTR. Naa Nuvve movie relesin on June 14. Legendary lensman PC Sreeram is the cinematographer for Naa Nuvve, while popular adman Jayendra has directed the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X