పిరికిపందల్లా బతకడం నేర్పించలేదు: ఎన్టీఆర్
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం‘నాన్నకు ప్రేమతో'. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. సుకుమార్ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సినిమా ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఈ చిత్రంలోని పాటలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన తండ్రి తమకేం నేర్పించాడో చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు మా ముగ్గురికీ ఒక్కటే చెప్పారు. కిందపడండి.. మిమ్మల్ని మీరే నమ్ముకొని పైకి రండి అని చెప్పారు. ఏ రోజూ పిరికిపందల్లా బతకడం నేర్పించలేదు. ఈ జీవితాన్నిచ్చిన నాన్నగారికి కృతజ్ఞతలు. ఇక సినిమా విషయానికొస్తే ఇందులో ఎన్టీఆర్‌ని చూడరు. సుకుమార్‌ని చూస్తారు. రాజేంద్రప్రసాద్‌లో సుకుమార్ తండ్రిగారిని చూస్తారు. సుకుమార్ తండ్రిగారు కొనవూపిరితో ఉండగా పుట్టిన కథ ఇది.

నాన్నకి ఏదైనా అయ్యిందంటే ఎంతగా తల్లడిల్లిపోతాం. కానీ సుకుమార్ తనకుండే బాధని దిగమింగుకొని ఈ కథని రాశాడు. తను కథని కాకుండా... జీవితాన్ని రాస్తాడు. ఇలాంటి గొప్ప కథ నా 25వ చిత్రంగా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకోసం చాలా త్యాగం చేశాడు. దేవి, సుకుమార్, నేను, విజయ్ కె.చక్రవర్తి... ఇలా ఈ సినిమా కోసం పనిచేసినవాళ్లల్లో చాలామంది నాన్న పిచ్చోళ్లు ఉన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ మంచి నటి. జగపతిబాబుగారు నా హృదయానికి దగ్గరగా ఉండే వ్యక్తి. ఆయన నటించకపోతే ఇది గొప్ప సినిమా అయ్యుండేది కాదు'' అన్నారు.
ఈ స్పీచ్ ని మీరు ఇక్కడ పూర్తిగా చూడవచ్చు...
ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ : విజరు చక్రవర్తి, ఆర్ట్ : రవీందర్, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఎడిటింగ్ : నవీన్ నూలి, పాటలు : చంద్రబోస్, డాన్స్ : రాజు సుందర కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications











