జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల సినిమాపై భిన్న వాదనలు
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొంద బోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'యాక్షన్' అనే టైటిల్ తో పాటు 'విత్ ఎంటర్‌టైన్మెంట్' అనే సబ్ టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుందని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కావడం లేదని, మార్చి 18 నుంచి షూటింగ్ జరుపుకోనుందని ఆ వార్తల సారాంశం.
ఈ వాయిదాకు ఓ బలమైన కారణం కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'దమ్మ' చిత్రం చేస్తున్న జూనియర్ ఆ సినిమాపై ప్రత్యేక మైన శ్రద్ధ పెట్టాడని, కొన్ని సీన్లు బాగా రావడానికి మళ్లీ రీ షూట్ చేస్తుండటంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతోందని, ఈ కారణంగానే 'యాక్షన్' చిత్రాన్ని మార్చి నెలకు వాయిదా వేశారని అంటున్నారు.
'యాక్షన్' చిత్రాన్ని శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ బ్యానర్ పై గణేష్ బాబు నిర్మిస్తున్నారు. గోపీ మోహన్, కోన వెంకట్ ఈ చిత్రం కోసం స్క్రిప్టు, డైలాగులు రెడీ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది. జూ ఎన్టీఆర్‌ను ఈ సినిమా ద్వారా పూర్తి కొత్త లుక్ తో చూపించేందుకు శ్రీను వైట్ల ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











