»   » ఎన్టీఆర్‌ అత్తకూతురు ఎవరనేదే సస్పెన్స్

ఎన్టీఆర్‌ అత్తకూతురు ఎవరనేదే సస్పెన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Ntr Steps with Samantha or Praneetha?
  హైదరాబాద్: 'కొండవీటి సింహాసనం' చిత్రంలోని 'అత్తమడుగువాగులోనా.. అత్తకూతురో' పాటని ఎన్టీఆర్ తాజా చిత్రంలో రీమిక్స్‌ చేస్తారనే విషయం తెలిసిందే. తాతయ్య పాటల్ని తన సినిమాలో రీమిక్స్‌ చేయడం ఎన్టీఆర్‌కి ఇది మూడోసారి. అల్లరి రాముడులో 'ఆకుచాటు పిందె తడిసె', యమదొంగలో 'ఒలమ్మీ తిక్కరేగిందా..' పాటల్ని ఎన్టీఆర్‌ రీమిక్స్‌ చేశారు. అయితే ఈ రిమీక్స్‌ విషయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సివుంది. మరి ఈ పాటలో ఎన్టీఆర్‌ అత్తకూతురు సమంతనో, ప్రణీతనో అనేది సస్పెన్స్. ఈ విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు.

  ఎన్టీఆర్‌ హీరోగా బెల్లంకొండ సురేష్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకుడు. సమంత, ప్రణీత హీరోయిన్స్. మంగళవారం నుంచి రాజధానిలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పది రోజుల పాటు ఇక్కడే షూటింగ్‌ నిర్వహిస్తారు. ఆ తరవాత జైపూర్‌లో మరో షెడ్యూలు ప్రారంభిస్తారు. ఈ సినిమాకి 'రభస' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


  అదిరిపోయే స్టెప్పులు, ఆకట్టుకొనే సంభాషణలు, గుర్తుండిపోయే యాక్షన్‌ ఘట్టాలూ - ఎన్టీఆర్‌ సినిమా అంటే ఈజోరంతా ఉండాల్సిందే. అభిమానుల అంచనాలు అందుకొంటూనే, ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి తన స్పీడు చూపించబోతున్నాడు.

  సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.


  ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.


  ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

  English summary
  
 NTR has launched the remix song sentiment again. NTR was in a dire need of hit film and once again he gone to the roots and started chanting his grandfather name.If reports to believed NTR is going to remix the one more high energetic mass voltage song of NTR movie. NTR is getting ready to shake legs with Heroine Aksha for the remix song of 'Kondaveeti Simham' . 'Athamadugu Vaagulonaa' song is now being considered to remix for Young Tiger ntr's new movie 'Rabhasa' 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more