»   » సొంతంగా స్టూడియో నిర్మిస్తున్న జూ ఎన్టీఆర్

సొంతంగా స్టూడియో నిర్మిస్తున్న జూ ఎన్టీఆర్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో సొంతంగా సినీ ఆర్ట్ స్టూడియోను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడియోకు 'ఎన్టీఆర్ స్టూడియో" అని నామకరం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వందల ఎకరాల ఆసామి. హైదరాబాద్ లో కోట్లకు పడగలెత్తిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. అల్లుడి కోరిక మేరకు స్టూడియో నిర్మాణానికి హైదరాబాద్ లోని ఖరీదైన స్థలాలను కట్నం కింద ఎన్టీఆర్‌కు ఇచ్చాడని, ఆ స్థలంలోనే జూనియర్ స్టూడియో నిర్మాణం జరుపబోతున్నాడని అంటున్నారు.

    తన తాత ఎన్టీఆర్ పేరుతో నిర్మాణం కాబోతున్న ఈ స్టూడియో హైటెక్ సిటీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకోనుంది. తన సినిమాల షూటింగ్ లకు ఉపయోగించుకోవడంతో పాటు, ఇతర సినిమా షూటింగ్‌లకు దీన్ని అద్దెకు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఉన్న రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలు చాలా ఓల్డ్. వీటికి భిన్నంగా ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా సరికొత్త డిజైన్స్ తో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతోందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.

    English summary
    Young hero Jr NTR is going to come up with a state-of-the-art studio very soon and already the preparations for that has begun. It is heard that the studio has been named as ‘NTR Studio’.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more