twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్-సుకుమార్ మూవీ అఫీషియల్ ప్రెస్ నోట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు వివరాలు అఫీషియల్ గా విడుదల చేసారు. సుకుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది.

    ఈ విషయమై నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‘ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రమిది. ఎన్టీఆర్ కి మా బేనర్లో ఇది మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెయిన్ లో జరిగాయి. దేవి ఐదు అద్భుతమైన పాటల్నిఇచ్చారు అని తెలిపారు.

    NTR, Sukumar Film From June 1st Week

    జూన్ మొదటి వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, సాహసం, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ తో కలిసి చేస్తున్న మరో భారీ చిత్రమిది అని బివిఎస్ఎన్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

    ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్: నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

    English summary
    According to the latest news, regular shooting of NTR, Sukumar film will start in first week of June . Rakul Preet Singh will pair up with NTR for the first time and B.V.S.N.Prasad will produce the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X