»   » ఎన్టీఆర్-సుకుమార్ మూవీ డేట్ ఫిక్సయింది

ఎన్టీఆర్-సుకుమార్ మూవీ డేట్ ఫిక్సయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం ఈ నెల 13న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన వెంటనే స్మాల్ గ్యాప్ తీసుకుని తన తర్వాతి ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు యంగ్ టైగర్.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. మార్చి 1న ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం విశేషం.

NTR, Sukumar film from March 1st week

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టెంపర్' సినిమా విషయానికొస్తే...ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానుంది.

ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్, బండ్ల గణేష్ నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

English summary
NTR is busy giving finishing touches to his latest project Temper. Once he is done with this project, he will move on to his next in the direction of Sukumar. Latest update on this project is that the regular shooting of this film will kick start in March 1st week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu