ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ డిటేల్స్ (అఫీషియల్)
హైదరాబాద్ : మహేష్ తో చేసిన నేనొక్కడినే చిత్రానికి మిశ్రమ స్పందన రావటంతో ఎన్టీఆర్ తో సుకుమార్ చిత్రం ఉండకపోవచ్చునంటూ రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ రూమర్స్ కి చెక్ చెప్పటానికా అన్నట్లు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ ఖరారు చేసారు. ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే భారీ చిత్రం షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది
ఎన్టీఆర్ స్పీడు మీదున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఇప్పుడాయన సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ కథకూ ఓకే చెప్పారు. ఎన్టీఆర్- సుకుమార్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
నిర్మాత మాట్లాడుతూ ''సుకుమార్‌గారు ఈ చిత్రం కోసం సూపర్ సబ్జెక్ట్ సిద్ధం చేశారు. మా బేనర్‌లో ఇది మరో హిట్ మూవీ అవుతుందనే నమ్మకం కలిగింది. సుకుమార్ చెప్పిన కథాంశం మాకెంతో నచ్చింది. వెంటనే ఎన్టీఆర్ కూడా పచ్చజెండా వూపారు. అభిమానుల్ని అలరించేలా అన్ని అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకొంటుంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం'' అన్నారు.
''ఎన్టీఆర్ శైలిని దృష్టిలో ఉంచుకొని రాసిన కథ ఇది. ఆయన పాత్రని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నా. తప్పకుండా అభిమానులకు ఈ సినిమా పండగే. ఎన్టీఆర్‌కు చెప్పిన లైన్ విని ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఇమేజ్‌కి తగినట్లుగా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూనే సరికొత్త స్టయిల్‌లో ఈ సినిమా ఉంటుది'' అంటున్నారు సుకుమార్. ఈ చిత్రానికి సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications












