ఎన్టీఆర్ కొత్త చిత్రం మార్చి 5 నుంచి...డిటేల్స్
హైదరాబాద్ : టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ తన నెక్ట్స్ చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. మార్చి 5న చిత్రం ప్లోర్ మీదకు వెళ్ళనుంది. అలాగే...జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బోగవల్లి బాపినీడు పాల్గొన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్తరం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది. ఈ రోజు ముహూర్తం బాగుండటంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











