ఎన్టీఆర్, సుకుమార్ చిత్రం పూజ (ఫొటోలు)
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్ లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు ఈ రోజు (డిసెంబర్ 18) ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బోగవల్లి బాపినీడు పాల్గొన్నారు.
https://www.facebook.com/TeluguFilmibeat
జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. మా బేనర్ లో ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది అని నిర్మాత అన్నారు.

స్క్రిప్టు తీసుకుంటూ...
నిర్మాత ఛత్రపతి ప్రసాద్ గారి నుంచి దర్శకుడు సుకుమార్ స్క్రిప్టు తీసుకుంటూ ఇలా ...

ఆపీస్ లోనే...
నిర్మాత బి.వియస్ ఎన్ గారి ఆఫీస్ లో ఈ పూజ కార్యక్రమం జరిగిన అనంతరం ఇలా స్ర్రిప్టు తీసుకున్నారు.

పూజలో
నిర్మాత ప్రసాద్ గారు, సుకుమార్ ఇలా పూజలో పాల్గొని భగవంతుడు ఆశీస్సులు తీసుకుంటూ...

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ...
ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ...
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్తరం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది. ఈ రోజు ముహూర్తం బాగుండటంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం అన్నారు.


Click it and Unblock the Notifications











