ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...
ఎన్టీఆర్, తమన్నా, ప్రధాన తారాగణం పాల్గొనగా 32 రోజుల పాటు తొలి షెడ్యూల్ చేశాం.శక్తివంతమైన కథతో అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో రూపొందిస్తోన్న ఈ చిత్రం మా సంస్థ ప్రతిష్ఠను పెంచుతుంది. ఎన్టీఆర్ అభినయం ప్రధానాకర్షణగా తయారవుతున్న ఈ చిత్రంలో ఎన్నో విశేషాలుంటాయి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని సంకల్పించాం అని చిత్ర నిర్మాత ప్రసాద్ మీడియాకు తెలియచేసారు.జూనియర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది.
ఈ సందర్భంగా ఏర్పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, విదూత్ జామ్వాల్, ఆద్విక్ మహాజన్, పాయల్ ఘోష్, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, దువ్వాసి మోహన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రవీందర్, పాటలు: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, రామజోగయ్య శాస్ర్తీ, నిర్మాత: బివిఎస్‌ఎన్ ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి


Click it and Unblock the Notifications











