నవంబర్‌లో నా పెళ్లి లేదు..అది పుకారే జూ ఎన్టీఆర్
పెళ్లి వచ్చే ఏడాది నా పెళ్లి నవంబర్‌లో అనే ప్రచారం జరుగుతోంది. కానీ నవంబర్‌లో నా పెళ్లి లేదు. వచ్చే ఏడాది ఉంటుంది. ఎప్పుడనేది నేనే చెబుతా అంటూ తేల్చి చెప్పారు జూ.ఎన్టీఆర్. ఆయన తాజా చిత్ర బృందావనం చిత్రం రేపు విడుదల కానున్న సందర్భంగా ఈ విషయాలు తెలియచేసారు. అలాగే...నేను సాంప్రదాయక పెళ్లి చేసుకుంటున్నా. మా అమ్మా నాన్న వెతికి చూసిన సంబంధం. అలాగే పెళ్లి బట్టల కోసం బ్యాంకాక్ వెళ్లాననే ప్రచారంలో కూడా ఏమాత్రం నిజంలేదు. పెళ్లిలో నేను వేసుకునేవి కూడా సాంప్రదాయకమైనవే. సూటూ బూటూ వేసుకుని చేసుకోను. అభిమానుల మధ్య పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. ఎంతవరకు వీలవుతుందో చూడాలి. లక్ష్మీ ప్రణతితో మాట్లాడుతుంటా కానీ కలవడం బాగా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు.
జూ ఎన్టీఆర్ పెళ్ళి లక్ష్మీ ప్రణతి బృందావనం బ్యాంకాక్ jr ntr marriage laxmi pranathi brindavanam bangcock


Click it and Unblock the Notifications