నేనూ తారకరత్న కలిసి నటిస్తే...: ఎన్టీఆర్
నిజమై..బాబాయ్ తో కలిసి సినిమా చేయాల్సి వస్తే అటు నేను...ఇటు అభిమానులు లెక్కలు వేసుకోరు.నేనూ కళ్యాణ్ అన్నయ్య ...నేను తారకరత్న కలిసి నటిస్తే ఇమేజ్ గురించి అంతగా పట్టించుకోనవసరం ఉండదు.కానీ మాకు సరిపోయే కథలు రావాలి అన్నారు ఎన్టీఆర్.ఆయన్ని మీడియావారు మల్టి స్టారర్ సినిమాలు రాకపోవటానికి కారణం హీరోలు ఒప్పుకోకపోవటమే కారణమా అని అడిగినప్పుడు ఇలా స్పందిచారు. అయినా ఇప్పుడు ఒక స్టార్ తో సినిమా తీయటమే గగనం అయిపోతోంది. మరో స్టార్ ని ఎలా జోడిస్తారు..ఒక హీరో వంద మందిని నరికితే మరో హీరో రెండు వందల మందిని నరకాలి. ఒకరికి మూడు పాటలుంటే మరో హీరోకి ఒకటి ఎక్కువుండాలి.ఈ లెక్కలు మేం వేసుకోకపోయినా ప్యాన్స్ వేసుకుంటారు అన్నారు.
ఊసరవెల్లి ప్రమోషన్ లో భాగంగా మీడియావారు ఎన్టీఆర్ ని కలిసినప్పుడు ఈ విషయాలన్ని చెప్పుకొచ్చారు. అలాగే తన తదపరి చిత్రాలు గురించి చెబుతూ..బోయపాటి శ్రీను దమ్ము విందు భోజనంలా ఉంటుంది. ఆ తర్వాత శ్రీను వైట్ల, పూరీ జగన్నాధ్ చిత్రాలు ఉంటాయి అన్నారు. ఇక ఊసరవిల్లి విజయం గురించి చెబుతూ..ఊసరవెల్లి నాకు స్పెషల్ ఫిల్మ్. పరిశ్రమ రికార్డులను దాటుకుని ముందుకు వెళ్ళుతోందంటే సంతోషంగా ఉంది. ఏడుపు,నవ్వు, భయం ఒకటేమిటి అన్ని భావోద్వాగాలు ఉన్న చిత్రం. అందుకే రాతలు కాదు తలరాతలు మార్చే చిత్రం అన్నాను అన్నారు ఆనందంగా.


Click it and Unblock the Notifications











