బాలీవుడ్ సెక్సీ నటి తనీషా ముఖర్జీ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఎన్టీఆర్ సరసన కంత్రీ సినిమాలో నటించేందుకు ఆమె అంగీకరించింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. తనీషా రెండో హీరోయినుగా నటించడానికి అంగీకరించింది. ఈ పాత్రకు జియాఖాన్, రియా సేన్ పేర్లను పరిశీలించారు. అశ్వినీ దత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ సినిమా వస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగు యాభై శాతం ఇప్పటికే పూర్తయింది. తనీషా బాలీవుడ్ నటి కాజోల్ సోదరి. తనీషా నీల్ అండ్ నిక్కి అనే హిందీ సినిమాలో నటించింది. తనీషా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె నటించిన తమిళ చిత్రం నీ వల్లే నీ వల్లే అనే పేరుతో తెలుగులోకి డబ్బయింది.