సమంతను టీజ్ చేస్తున్న జూ.ఎన్టీఆర్

By Srikanya

హైదరాబాద్ : బాద్ షా విజోయోత్సాహంలో ఉన్న జూ.ఎన్టీఆర్...హాట్ బ్యూటీ సమంతను టీజ్ చేసారు. అయితే అది నిజ జీవితంలో కాదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం ఆమెను టీజ్ చేసారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను ఈ మద్యనే చిత్రీకరించారు. అవి చాలా బాగా వచ్చాయని హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో వచ్చిన బృందావనం హిట్ కావటంతో ఈ కాంబినేషన్ పై మరింత అంచనాలు పెరుగుతాయి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. గబ్బర్ సింగ్ తో తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్న హరీష్ ఈ చిత్రంతో తెలుగులో తిరుగులేని దర్శకుడుగా ఎదుగుతాడంటున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X