అది లెక్క : ఎన్టీఆర్ ‘టెంపర్’ వర్కింగ్ స్టిల్(ఫొటో)
హైదరాబాద్ : శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొత్త వర్కింగ్ స్టిల్ ని పూరి విడుదల చేసారు. ఈ స్టిల్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏటిట్యూడ్ కనపడుతోంది. ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టబోతున్నారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇన్సపెక్టర్ దయ గా కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా రగ్గడ్ గా ఉండబోతోందని, చాలా సార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్ర ఇదని చెప్తున్నారు. సర్కిల్ ఇన్సపెక్టర్ గా ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడని వినికిడి. నాగార్జున శివ మణి లో చేసిన పాత్ర తరహాలో పూర్తి మాస్ టచ్ లో ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

అలాగే ఈ చిత్రం ఆడియో జనవరి 10న విడుదల అయ్యే అవకాసం ఉంది. థియోటర్ ట్రైలర్ ఫిబ్రవరి 5 న విడుదల చేసి మార్చి చివరకు సినిమాని విడుదల చేస్తారు. ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకుండూంటంతో మంచి క్రేజ్ వస్తోంది.
కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు.
ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











