ఎన్టీఆర్‌కు అగ్నిపరీక్ష.. కంగారు పెడుతున్న రికార్డు.. త్రివిక్రమ్ మరి ఏం చేస్తాడో!
టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు బాక్సాఫీస్ అగ్ని పరీక్షగా మారుతుంది. ఒకప్పుడు ఎన్ని రోజులు ఎక్కువ ఆడితే అంత గొప్పగా చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తక్కువ రోజుల్లో ఎక్కువ వసూళ్లు ఉంటే తమ స్టామినాగా చెప్పుకొంటున్నారు. సినిమా సినిమాకు స్టార్ హీరోల రేంజ్ పెరిగిపోతున్నది. నిన్న, మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ కూడా గ్రాస్ 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. నికరంగా రూ.75 కోట్ల మైలురాయిని అధిగమించిన వారిలో ఐదుగురు అగ్రహీరోలు మాత్రమే ఉన్నారు. అయితే ఆ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసే అంశంగా మారింది.

బాహుబలి చిత్రంతో ప్రభాస్
బాహుబలి విజయంతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌ను సెట్ చేశాడు. దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను అవలీలగా సాధించిన హీరోగా ఘనతను సాధించాడు. తెలుగులో ఆయన రేంజ్ రూ.75 కోట్లకుపైనే. ఇక సాహోతో ప్రభాస్ రేంజ్ కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది.

అవలీలగా చిరంజీవి
రాజకీయ ప్రవేశం అసంతృప్తిని మిగిల్చడంతో టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150తో బాక్సాఫీస్‌ను కుదిపేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో నికరంగా రూ.75 కోట్ల మార్కును ఒక్క అంగతోనే దాటేశాడు.

బాక్సాఫీస్‌పై ప్రిన్స్ మహేష్ పంజా
భరత్ అనే నేను, శ్రీమంతుడు చిత్రాలతో మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఎంటో తెలిసిపోయింది. ఈ రెండు చిత్రాలు నికరంగా రూ.75 కోట్లు సాధించాయి. దాంతో ప్రిన్స్‌కు వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.

రంగస్థలం, గీతా గోవిందంతో
రంగస్థలంతో రాంచరణ్, గీతా గోవిందంతో విజయ్ దేవరకొండ సునాయసంగా రూ.75 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను దాటేశారు. ఇక స్టార్ హీరోల్లో ఈ మార్క్‌ను అధిగమించాల్సిన వారిలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు. ఇక వీరిద్దరిలో ఆ మార్కును అధిగమించే సత్తా ఉన్నట్టు ఎన్టీఆర్ కనిపిస్తున్నారు.

ఎన్టీఆర్‌కు అగ్ని పరీక్ష
త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్దికాలంగా టాలీవుడ్‌లో తన ముందు ఉన్న 75 కోట్ల మార్కును ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ చేరుకొంటారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. కొద్ది రోజులాగితే బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ పంజా ఎలా ఉంటుందో తెలిసిపోయడం ఖాయం.


Click it and Unblock the Notifications











