ఎన్టీఆర్, ఇలియానా జంటగా కృష్ణవంశి రూపొందించిన రాఖి చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా హిట్ పెయిర్ రిపీట్ కాబోతోంది. తాజాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చెయ్యబోతున్న సినిమా ద్వారా ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి తెరకెక్కబోతోంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 15 నుండి ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే వినాయక్ పూర్తి స్క్రిప్టుతో ఎన్టీఆర్ ని మెప్పించాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందిట. ఆమె కోసం సెర్చింగ్ జర్గుతోంది. మరో ప్రక్క ఇలియానా వి.యన్.ఆదిత్య -నితిన్ తో చెయ్యబోయే సినిమా ఒప్పుకుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు మధ్య డేట్స్ ఎడ్జెస్ట్ చెయ్యిటానికి ఇలియానా ప్లాన్ చేస్తోంది.అంతేగాక ఇలియానా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రవితేజ ప్రక్కన చేయటానికి పచ్చజెండా ఊపింది.