ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా బ్యాక్ డ్రాఫ్ ఏంటో తెలుసా, రిలీజ్ డేట్ ఖరారు!
'జైలవకుశ' తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్‌శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీలో పూర్తి అయ్యింది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. వచ్చే నేల రెండోవారంలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరణ తర్వాత అల్యూనిమియమ్ ఫ్యాక్టరీలో మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సినిమాను ఫాస్ట్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ కోసం ఎన్టీఆర్ తన ఫిట్ నెస్ లో మార్పులు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ కూడా కేర్ తీసుకొని సినిమా చేస్తున్నాడు. సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాఫ్ లో ఉంటుందని సమాచారం. రాయలసీమ కుర్రాడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











