ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్
హైదరాబాద్ : ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చిత్రం వస్తుందంటూ చాలా కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రీసెంట్ గా ఈ చిత్రం గురించి,హీరో,దర్శకుడు ఓ క్లారిటీ కి వచ్చారని సమాచారం. పవన్ తో చేస్తున్న త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం అనంతరం ఈ చిత్రం ఉండనుందని విశ్వసనీయ సమాచారం.
మైత్రీ మూవీస్ (ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ) అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే యేడాది ఏప్రిల్ నుంచి ఈ చిత్రం మొదలవుతుందని తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత 'రభస'తోపాటు వక్కంతం వంశీ చిత్రాలు చేస్తారు. త్రివిక్రమ్ రూపొందిస్తున్న తాజా చిత్రం షూటింగ్ తుది దశకు చేరింది. వచ్చే నెలలోనే విడుదలవుతుంది. ఆ తరవాత ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమవుతారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ .... పవన్‌కల్యాణ్‌తో 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఈ చిత్రం పూర్తి యాక్షన్,ఎంటర్టైనర్ కలిసిన మిక్చర్ గా ఉండబోతుంది. ఎన్టీఆర్ లైన్ విన్న వెంటనే మారుమాట చెప్పకుండా ఓకే చేసేసాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ తనకు కొత్త తరహా చిత్రం అవుతుందని భావిస్తున్నాడని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications












